Sneha TV

సిర్లీ హిల్స్ కాలనీలో గణపతి హోమం

సిర్లీ హిల్స్ కాలనీలో గణపతి హోమం
X

బాలాపూర్, సెప్టెంబర్12, ప్రజాపాలన ప్రతినిధి : పరమ శివపార్వతుల తనయుడు విగ్నేశ్వర దగ్గర శ్రీ మాతా ఉమెన్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సిర్లా హిల్స్ కాలనీ రోడ్ నెంబర్ 2 గణేష్ మండపం వద్ద గణపతి హోమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథి 27వ డివిజన్ కార్పొరేటర్ పసునూరి బిక్షపతి చారి లక్ష్మి దంపతులతో పాటు పలువురు దంపతులు హోమంలో పాల్గొని, స్వామివారి తీర్థప్రసాదాలు స్వీకరించారు. హోమంలో పాల్గొన్న దంపతు లందురు శ్రీమాతా ఉమెన్స్ అసోసియేషన్ వారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సుమిత్ర శ్రీనివాస్ గౌడ్, అరుణ లక్ష్మణ్ చారి, సుశీల రామచంద్రయ్య, శ్రీలత సంపత్, పద్మ పెంటయ్య, పల్లవి దేవానంద్, కాలనీవాసులు సంగీత, మంజుల, శ్యామల, స్వప్న, వెంకటేష్, శివకుమార్ చారి, పెద్ద సంఖ్యలో కాలనీవాసులు పెద్దలు పాల్గొన్నారు.

Next Story
Share it