Sneha TV

మత్యగిరి ఆలయంలో రామలింగేశ్వర స్వామి కళ్యాణం

వలిగొండ ప్రజాపాలన ప్రతినిధి మండల పరిధిలోని వెంకటాపురం గల శ్రీ మత్స్యగిరి లక్ష్మీనర్సింహా స్వామి ఆలయంలోని అనుబంధ దేవాలయమైన శ్రీ పంచముఖ పార్వతీ సమేత రామలింగేశ్వర స్వామి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలలో భాగంగా ఈనెల 17వ తేదీ శనివారం స్వామివారి కళ్యాణం ఘనంగా నిర్వహించడం జరుగుతుందని కోవిడ్ నిబంధనలకు అనుగుణంగా అర్చకులు, ఋత్వికులచే నిర్వహించడం జరుగుతుందని ఆలయ కార్యనిర్వహణాధికారి కె రవికుమార్, ధర్మకర్తల మండలి చైర్మన్ ముద్దసాని కిరణ్ రెడ్డి లు గురువారం ఒక ప్రకటనలో తెలిపారు.

Next Story
Share it