Sneha TV

ఓం శివోమ్ తో మార్మోగిన శివాలయాలు...

ఓం శివోమ్ తో మార్మోగిన శివాలయాలు...
X

ఓం నమో శివాయ నామస్మరణతో మహాశివరాత్రి రోజున భక్తుల మొక్కలు

బీరుపూర్/సారంగాపూర్, మర్చి 11 (ప్రజాపాలన ప్రతినిధి): సారంగాపూర్ మండలం పెంబట్ల కోనపూర్ శ్రీ దుబ్బరాజేశ్వర స్వామి జాతర బ్రహ్మోత్సవాల్లో భాగంగా గురువారం నాడు మహాశివరాత్రి పర్వదినం రోజున భక్తులు జాగరణతో మొక్కలు తీర్చుకున్నారు. బీరుపూర్ శివాలయంలో తుంగూర్ గుట్ట రాజేశ్వరస్వామి ఆలయంలో శివ భక్తులు అధిక సంఖ్యలో మొక్కలు చెల్లించుకున్నారు. దుబ్బరాజేశ్వరస్వామీ జాతరకు భక్తులు అధిక సంఖ్యలో పోటెత్తారు. జగిత్యాల జిల్లా జాయింట్ కలెక్టర్ రాజేశం దంపతులు కుటుంబ సమేతంగా స్వామివారిని దర్శనం చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ కోల జమునశ్రీనివాస్ జడ్పీటీసీ మేడిపల్లి మనోహర్ రెడ్డి మున్సిపల్ చైర్ పర్సన్ బోగ శ్రావణి ఆలయ ట్రస్టు చైర్మన్ పోరండ్ల శంకరయ్య ఈవో కాంతారెడ్డి సర్పంచులు బొడ్డుపల్లి రాజన్న ఆకుల జమున పల్లికొండ రమేష్ ధర్మకర్తలు రెవెన్యూ అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Next Story
Share it