Top
Sneha TV

సఖి సేవలను సద్వినియోగం చేసుకోవాలి.

సఖి సేవలను సద్వినియోగం చేసుకోవాలని సఖి నిర్వహురాలు సౌజన్య తెలిపారు

సఖి సేవలను సద్వినియోగం చేసుకోవాలి.
X

ఇబ్బందుల్లో ఉన్న మహిళలు సఖి సేవలను సద్వినియోగం చేసుకోవాలని సఖి నిర్వాహకురాలు సౌందర్య సూచించారు. బుధవారం ఆసిఫాబాద్ మండలంలోని ఉప్పల్ నావేగం గ్రామములో సఖి కేంద్రం ఆధ్వర్యంలో మహిళలకు సఖి అందిస్తున్న సేవలపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా సఖి యొక్క ఐదు రకాల సేవలను వైద్య, కౌన్సిలింగ్ పోలీస్ న్యాయ తాత్కాలిక వసతి, సేవలపై అవగాహన కల్పించారు. అదేవిధంగా మహిళల హెల్ప్ లైన్ 181 ను వివరించారు. అనంతరం సఖి నిర్వాహకురాలు సౌందర్య మాట్లాడుతూ ప్రతిరోజు ఏదో రకంగా అన్యాయాలకు గురవుతున్న మహిళలకు సఖి అండగా ఉంటుందన్నారు. పిల్లలకు ఎలాంటి సమస్యలు ఉన్నా సఖి కేంద్రానికి రావద్దని, ఎవరికైనా సమస్యలు ఉన్నా చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో కేస్ వర్కర్ మౌనిక, పారామెడికల్ స్వాతి, మల్టీ పర్పస్ ప్రవీణ్, మహిళలు పాల్గొన్నారు.

Next Story
Share it