Top
Sneha TV

వరిధాన్యం శుభ్రత యంత్రాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలి.

వరిధాన్యం శుభ్రత యంత్రాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలి. జిల్లా కలెక్టర్ భారతి హోళ్ళికేరి.

జిల్లాలోని రైతుల సౌకర్యార్థం ప్రభుత్వం అందిస్తున్న వరిధాన్యం శుభ్రపరిచే యంత్రాలను రైతులు నద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ భారతి హోళ్ళికేరి అన్నారు. బుధవారం జిల్లా కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ కమిటీ గోదాములో ఉంచిన యంత్రాలను ప్రారంభించిన అనంతరం మాట్లాడారు. ఒక యంత్రం విలువ 65 వేల రూపాయలు ఉంటుందని, ఇప్పటి వరకు 48 యంత్రాలను కొనుగోలు చేయడం జరిగిందని పేర్కొన్నారు. వాటిలో మొదటి విడతగా 24 వరిధాన్యం శుభ్రం చేసే యంత్రాలను అందించడం జరుగుతుందని, రబీ సీజన్ కు సంబంధించిన ప్రతి కొనుగోలు కేంద్రంలో ఈ యంత్రం ఉండే విధంగా తగు చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. వీటిని గుర్తించబడిన జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ, పి.ఎ.సి., డి.సి.ఎం. మూడు ఏజెన్సీలకు నిబంధనల మేరకు అందించడం జరుగుతుందని తెలిపారు. రైతులు నాణ్యమైన ధాన్యమును మాత్రమే కేంద్రానికి తీసుకురావాలని తెలిపారు.

ఈ కార్యక్రమంలో జిల్లా గ్రామీణాభివృద్ది అధికారి బి. శేషాద్రి, జిల్లా పౌర నరఫరాల అధికారి వెంకటేశ్వర్లు, జిల్లా మేనేజర్ గోపాల్, జిల్లా సహకార అధికారి సంజీవరెడ్డి, జిల్లా మార్కెటింగ్ అధికారి గజానంద్, నంబంధిత శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Next Story
Share it