Top
Sneha TV

గోజాతి, గేదెజాతి పశువులకు నట్టల నివారణ మందు పంపిణీ

గోజాతి, గేదెజాతి పశువులకు నట్టల నివారణ మందు పంపిణీ జిల్లా కలెక్టర్ భారతి హోళ్ళికేరి మంచిర్యాల జిల్లా ప్రతినిధి,డిసెంబర్ 16, ప్రజాపాలన.

గోజాతి, గేదెజాతి పశువులకు నట్టల నివారణ మందు పంపిణీ
X

జిల్లా కలెక్టర్ భారతి హోళ్ళికేరి

మంచిర్యాల జిల్లా ప్రతినిధి,డిసెంబర్ 16, ప్రజాపాలన.

ఈ నెలలో జిల్లాలోని గోజాతి, గేదె జాతి పశువులకు నట్టల నివారణ మందు పంపిణీ చేయడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ భారతి హోళ్ళికేరి అన్నారు. బుధవారం జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ భవన సముదాయంలోని కలెక్టర్ బాంబర్లో జిల్లా పశు సంవర్ధకశాఖ అధికారి శంకర్, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి వీరయ్యతో కలిసి నంబంధిత గోడప్రతులను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్రంలో గోజాతి, గేదెజాతి పశువుల నంఖ్య 68 లక్షల వరకు ఉంటుందని, వీటిపై ఆధారపడి 22.5 లక్షల కుటుంబాలు బ్రతుకుతున్నాయని అన్నారు. నట్టల నివారణ వల్ల పశువులలో వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుందని, ఒత్తిడి తగ్గి ఉత్పాదకత, పునరుత్పత్తి సామర్థ్యం పెరుగుతుందని, పశు వులు తిన్న ఆహారం సక్రమంగా వినియోగించుకొని అధిక పాల ఉత్పత్తి జరుగుతుందని, పశువులలో మరణాలు తగ్గుతాయని తెలిపారు. ప్రతి గ్రామంలో పశు వైద్య బృందాలచే నట్టల నివారణ కార్యక్రమం నిర్వహించడం జరుగు తుందని పేర్కొన్నారు. ఈ అవకాశాన్ని పాడి రైతులు సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా లీడ్ బ్యాంక్ మేనేజర్ హవేలిరాజు, జిల్లా ఉద్యానవన అధికారి రాజ్కుమార్, నంబంధిత

శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Next Story
Share it