Sneha TV
తెలంగాణ

ఘనంగా ఏఐఎస్ఎఫ్ 87 వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

ఘనంగా ఏఐఎస్ఎఫ్ 87 వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు
X

జన్నారం, ఆగస్టు 12, ప్రజాపాలన: మంచిర్యాల జిల్లా జన్నారం మండలం కేంద్రంలో ఏఐఎస్ఎఫ్ 87 వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను శుక్రవారం ఘనంగా నిర్వహించారు. మండలంలో ఏఐఎస్ఎఫ్ జెండాను ఏఐఎస్ఎఫ్ జన్నారం మండల అధ్యక్షులు అస్లం ఎగురవేశారు. 86 సంవత్సరాలు పూర్తి చేసుకుని 87 వ సంవత్సరంలోనికి అడుగుపెడుతున్న సందర్భంగా ఏఐఎస్ఎఫ్ నాయకులు కార్యకర్తలు విద్యార్థి నీ విద్యార్థులకు ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఏఐఎస్ఎఫ్ మండల ఈ అస్లం మాట్లాడుతూ ఉద్యమాలలో ఉద్భవించి పోరాడాల్లో సామ్యవాద సమ సమాజ స్థాపన కోసం అవి శాంతంగా పోరు సాగిస్తున్న ఏకైక విద్యార్థి సంఘం అఖిల భారత విద్యార్థి సమైక్యమని అన్నారు. స్వాతంత్ర మా జన్మ హక్కు అని భారత ప్రజలు ఎలుగెత్తి నినాదీస్తున్న తరుణంలో పిడికిలి బిగించి 1936 ఆగస్టు 12న ఉత్తరప్రదేశ్లోని లక్నోలోని గల బెనారస్ యూనివర్సిటీ ఏఐఎస్ఎఫ్ ఆవిర్భవించిందన్నారు. నేటి నుండి నాటి వరకు దేశ ప్రగతి వైపు నడిపించడానికి పోరాటాల మార్గాలని నిర్వహిస్తున్న విద్యార్థి సంఘం ఏఐఎస్ఎఫ్ అని అన్నారు. శాస్త్రీయ సోషలిజం గమ్యంగా చదువుకై పోరాడు నినాదంతో దేశంలో కాషాయ కర్ణ ప్రైవేటీకరణ కోర్పేరేటి కరణకు వ్యతిరేకంగా దేశంలో సెక్యులర్ రీజాన్ని ప్రజాస్వామ్య సమరశీల విద్యార్థి ఉద్యమాన్ని నిర్మిస్తున్న విద్యార్థి సంఘం ఏఐఎస్ఎఫ్ అని అన్నారు . 86 సంవత్సరాల చరిత్రలో దేశవ్యాప్తంగా ఎంతోమంది మహానీయులను మేధావులను విద్యావేత్తలను దేశాభివృద్ధికి అందించిన ఘనత కేవలం ఏఐఎస్ఎఫ్ కు ఉందన్నారు. ఈ కార్యక్రమంలో జన్నారం మండలం నాయకులు రాకేష్ , ఏజాస్, హేమంత్, కమలాకర్ తదితరులు పాల్గొన్నారు.

Next Story
Share it