Top
Sneha TV

శేరిలింగంపల్లి మండలంలో 46 జీఓను అమలు చేయాలి : బీజేవైయం డిమాండ్

శేరిలింగంపల్లి, ప్రజాపాలన ప్రతినిధి : శేరిలింగంపల్లి మండలంలో పూర్తి స్థాయిలో ఎమ్.ఈ.ఓ నియామకం కొరకు రంగారెడ్డి జిల్లా విద్యా శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ నందు సుకేంషికి బీజేవైయం శేరిలింగంపల్లి అసెంబ్లీ ఆధ్వర్యంలో వినతిపత్రం ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా రంగారెడ్డి అర్బన్ జిల్లా బీజేవైయం ప్రధాన కార్యదర్శి కుమ్మరి జితేందర్ మాట్లాడుతూ రంగారెడ్డి జిల్లా పరిధిలోని శేరిలింగంపల్లి మండలం పూర్తిస్థాయిలో ఎమ్.ఈ.ఓ ని నియమించక మూడు సంవత్సరాలు పూర్తి అవుతుందని, ప్రక్క మండలానికి చెందిన ఆఫీసర్ ని, ఇంచార్జ్ ఎమ్.ఈ.ఓ గా నియమించి కాలయాపన చేస్తున్నారని, కరోనా విలయతాండవం వల్ల విద్యార్థిని, విద్యార్థుల తల్లిదండ్రులు ఆర్ధికంగా తీవ్ర ఇబ్బందులు పడుతుంటే, మండల పరిధిలోని ప్రైవేట్, కార్పొరేట్ పాఠశాలలో ఆన్లైన్ క్లాసుల పేరిట అధిక ఫీజులు వసూలు చేస్తుంటే, పట్టించుకునే అధికారి లేదు, వసూలు చేసిన అధిక ఫీజులు పాఠశాలలు నుండి విద్యార్థులకు వెంటనే తిరిగి ఇప్పించాలి, జీఓ. సంఖ్య. 46 ను అమలు చేయాలని ప్రైవేట్, కార్పొరేట్ పాఠశాలపై ఒత్తిడి చేసేవిదంగా డి.ఈ.ఓ పనిచేయాలని కోరుతున్నామనినారు. ఇంచార్జ్ ఎమ్.ఈ.ఓ సమయ పాలన వల్ల మండలాల్లో ఉన్న ప్రభుత్వ, ప్రైవేట్, కార్పొరేట్ పాఠశాలలను సందర్శించడం లేదని, కావున మీరు వీలైన తొందరగా శేరిలింగంపల్లి మండలానికి పూర్తిస్థాయిలో(మండల ఎడ్యుకేటీషన్ ఆఫీసర్ )ని నియమించగలరని కోరుతూ, శేరిలింగంపల్లి అసెంబ్లీ భారతీయ జనతా యువ మోర్చా డిమాండ్ చేస్తుంది అని అన్నారు. ఈ కార్యక్రమంలో బీజేవైయం నాయకులు శివ గౌడ్, బీజేవైయం డివిజన్ అధ్యక్షులు సిద్దూ, శివకుమార్, మధుసూదన్ రావు, బీజేవైయం డివిజన్ నాయకులు శివశంకర్ గౌడ్, వెంకట్ పాల్గొన్నారు.

Next Story
Share it