Sneha TV
తెలంగాణ

పారుపల్లి మిత్ర బృందం ఆధ్వర్యంలో ఎమ్మెస్సార్ కు ఘన సన్మానం మధిర సెప్టెంబర్ 21 ప్రజా పాలన ప్రతినిధి మండలం పరిధిలో బుధవారం నాడు

పారుపల్లి మిత్ర బృందం ఆధ్వర్యంలో ఎమ్మెస్సార్ కు ఘన సన్మానం మధిర సెప్టెంబర్ 21 ప్రజా పాలన ప్రతినిధి మండలం పరిధిలో బుధవారం నాడు
X

పివిఆర్ ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు, విశ్రాంత ఉద్యోగ సంఘ అధ్యక్షులు శ్రీ పారుపల్లి వెంకటేశ్వరరావు, తన మిత్ర బృందం కలిసి జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత శ్రీ మేడేపల్లి శ్రీనివాసరావును పూలమాల, దుస్సాలువ, మెమొంటో అందిస్తూ ఘనంగా సన్మానించారు అనంతరం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో అవార్డు తీసుకోవటంతో శ్రీనివాసరావు బాధ్యత పెరిగిందని మున్ముందు కూడా ఇంకా శ్రమించి పాఠశాలకు మధిర మండలానికి మంచి పేరు తీసుకురావాలని సూచించారు.

ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ మేడిశెట్టి లీలావతి, ఎంపిటిసి అడపాల వెంకటేశ్వర్లు పాఠశాల విద్యా కమిటీ చైర్మన్ శ్రీ మేడిశెట్టి రామకృష్ణారావు, విశ్రాంత ఉపాధ్యాయులు శ్రీ కాలం వీరభద్రం, శ్రీ అన్నెం కోటేశ్వరరావు, శ్రీ బాహాటo సత్యనారాయణ రాజు, పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.

Next Story
Share it