Sneha TV
తెలంగాణ

ఫైల్ :2. ఫోటో రైటప్:22 ఏన్కూరు.2.తహశీల్దార్ కి వినతిపత్రం అందజేస్తున్న బీజేపీ మండల నాయకులు. రైతుబంధు వెంటనే రైతుల ఖాతాలో జమ చేయాలి.

ఫైల్ :2.    ఫోటో రైటప్:22 ఏన్కూరు.2.తహశీల్దార్ కి వినతిపత్రం అందజేస్తున్న బీజేపీ మండల నాయకులు.    రైతుబంధు వెంటనే రైతుల ఖాతాలో జమ చేయాలి.
X

ఏన్కూరు, జూన్ 22,(ప్రజా పాలన న్యూస్) :

వర్షాకాలం ప్రారంభమై విత్తనాలు వేసే సమయంలో కూడా ఇంతవరకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతుబంధు రైతులకు ఎప్పుడు ఇస్తామ నేది కూడా ప్రకటించడం లేదని,ప్రభుత్వం రైతుల బాధలను ఆలోచించి వెంటనే రైతుబంధు రైతు ఖాతాలో జమ చేయాలని బీజేపీ మండల అధ్యక్షుడు నల్లబోతుల రమేష్ కోరారు.బుధవారం ఏన్కూర్ మండల తహశీల్దార్ మహమ్మద్ కాశీ౦ కు రైతు సమస్యల పై కూడిన వినతిపత్రాన్ని అందజేశారు.ఈ సందర్భంగా రమేష్ మాట్లాడుతూ...తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతులకు ఇస్తానన్న రైతు రుణమాఫీ వెంటనే అమలు చేయాలని,ఆయన కోరారు. ప్రభుత్వం రైతే రాజును చేస్తామని చేయడం తప్ప రైతులకు ఒరిగిందేమీ లేదని ఆయన అన్నారు. సీజన్ ప్రారంభం కావడంతో రైతన్నలు విత్తనాలు వేస్తున్న తరుణంలో మార్కెట్లలో నకిలీ విత్తనాలు అమ్ము కుండా చూడాలి అని,నకిలీ విత్తనాలు అమ్మేవారిపై ప్రభుత్వం ఉక్కుపాదం మోపాలని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో దళిత మోర్చా అధ్యక్షుడు రెంటపల్లి నారాయణ,మండల కార్యదర్శి ఆది నరేష్,సిద్ధం శ్రీను,వేల్పుల వెంకన్న,వేల్పుల బిక్షం,కోటయ్య,తుాము వెంకటేశ్వర్లు,చల్లా రంగయ్య,నిఖిల్ తదితరులు పాల్గొన్నారు.

Next Story
Share it