Sneha TV
తెలంగాణ

గుర్తు తెలియని మృతదేహం లభ్యం

గుర్తు తెలియని మృతదేహం లభ్యం
X

బోనకల్, సెప్టెంబర్ 22 ప్రజా పాలన ప్రతినిధి: మండల పరిధిలోని మోటమర్రి గ్రామ బీడు భూముల్లో గుర్తు తెలియని వ్యక్తి మృతదేహాన్ని గురువారం బోనకల్ పోలీసులు గుర్తించారు. విశ్వసనీయ సమాచారం మేరకు సంఘటనా స్థలానికి చేరుకున్న స్థానిక ఎస్ఐ తేజావత్ కవిత మృతదేహాన్ని పరిశీలించారు. సుమారు పది రోజుల క్రితం మృతుడు మరణించినట్లు తెలుస్తోంది. మృతుడి ముఖ భాగం పూర్తిగా కుళ్ళి పోయింది. మృతుడు మోటమర్రి గ్రామానికి చెందిన వంగాల నరసింహ గా (45) కుటుంబ సభ్యులు గుర్తించారు. భార్య మరణించిన తర్వాత కొంత కాలంగా మృతుడి మానసిక స్థితి సరిగా లేకపోవడం వలన గత పది రోజుల క్రితం ఇంటి నుండి వెళ్లిపోయాడని కుటుంబ సభ్యులు పోలీసులకు తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Next Story
Share it