Sneha TV
తెలంగాణ

నేతకాని కులస్తులు అన్ని రంగాలలో ముందుండాలి*

నేతకాని కులస్తులు అన్ని రంగాలలో ముందుండాలి*
X

మంచిర్యాల టౌన్, సెప్టెంబర్ 22, ప్రజాపాలన: నేతకాని కులస్తులు అన్ని రంగాలలో ముందుండాలని గురువారం మంచిర్యాల జిల్లా కేంద్రంలో నేతకాని స్టూడెంట్ ఫెడరేషన్ జిల్లా కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ జుమ్మిడి గోపాల్ మాట్లాడుతూ నేతకాని కులస్తులు అన్ని రంగాలలో ముందుండాలని అన్నారు. రాబోయే ఎన్నికల్లో నేతకాని కులస్తులు ఐక్యంగా ఉండి చెన్నూర్ నియోజకవర్గంలో నేతకాని కులస్తులను ఎమ్మెల్యే గా గెలిపించుకోవలని అన్నారు. సంక్షేమ హాస్టళ్లలో కనీస మౌలిక సదుపాయాలు లేక విద్యార్థులు చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి విద్య పట్ల దృష్టి పెట్టాలని, పేద,మధ్య,తరగతి విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించి , నాణ్యమైన భోజనం పెట్టాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో నేతకాని స్టూడెంట్ ఫెడరేషన్ జిల్లా అధ్యక్షులు ముడిమడుగుల శేఖర్,కార్యదర్శి గోళ్ళ సాయి కుమార్,విష్ణువర్ధన్, మహేష్, సంతోష్,అజయ్,ఆనంద్,పండు, తదితరులు పాల్గొన్నారు.

Next Story
Share it