Sneha TV
తెలంగాణ

మధిరలో మైనర్ బాలిక కిడ్నాప్

మధిరలో మైనర్ బాలిక కిడ్నాప్
X

మధిరలో ప్రేమ పేరుతో మాయ మాటలు చెప్పి మైనర్ బాలికను తీసుకెళ్లిన యువకుడు*

మధిర సెప్టెంబర్ 22 ప్రజాపాలన ప్రతినిధి పట్టణంలోని స్టేషన్ రోడ్లులో నివాసం ఉంటున్న 13 సంవత్సరాలు మైనర్ బాలికను టౌన్ పోలీస్ స్టేషన్ సమీపంలో ఉన్న ఓ ఫోటో స్టూడియోలో పనిచేస్తున్న వరికూటి బాల గురవి రెడ్డి అనే యువకుడు కిడ్నాప్ చేసినట్లు బాలిక తల్లిదండ్రులు స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ప్రేమ పేరుతో మైనర్ బాలికకు మాయమాటలు చెప్పి కిడ్నాప్ చేసినట్లు సమాచారం. గతంలో కూడా గురివిరెడ్డి అమ్మాయిలకు మాయమాటలు చెప్పి మోసం చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. దీనిపై టౌన్ ఎస్ఐ సతీష్ కుమార్ ని వివరణ కోరగా వైరా ఏసీపీ రెహమాన్ ఆదేశాలు మేరకు మైనర్ బాలికను కిడ్నాప్ చేసిన వ్యక్తిని పట్టుకునేందుకు మూడు ప్రత్యేక పోలీసు బృందాలను ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు.

Next Story
Share it