Sneha TV
తెలంగాణ

రాష్ట్రానికి సీఎం కేసీఆర్ శ్రీరామరక్ష

రాష్ట్రానికి సీఎం కేసీఆర్ శ్రీరామరక్ష
X

పాలేరు సెప్టెంబర్ 22 ప్రజాపాలన ప్రతినిధి

విద్యుత్ సంస్కరణల పేరుతో ప్రవేట్ కు యత్నిస్తున్న కేంద్రం | కేంద్రం కుట్రలను తిప్పికొట్టేందుకు సిద్ధంగా ఉండాలి.

రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ నేలకొండపల్లి

తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కేసీఆర్ శ్రీరామరక్ష అని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ పేర్కొన్నారు. మండలం లోని ముజ్జుగూడెంలో నూతనంగా నిర్మించిన విద్యుత్ సబ్ స్టేషన్ ను గురువారం మంత్రి ప్రారంభించారు. రూ.1303.50 లక్షలతో కోనాయిగూడెం నుంచి నాచేపల్లి వరకు నిర్మించనున్న బీటీ రోడ్డుకు శంఖుస్థాపన చేశారు. మండలంలో పలు గ్రామాల్లో రైతు వేదికలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో నాణ్యమైన విద్యుత్ ను అందిస్తున్నట్లు తెలిపారు. తెలంగాణ రాక ముందు 7 వేల మెగావాట్లు ఉన్న · విద్యుత్ ను తెలంగాణ రాష్ట్రం వచ్చిన తరువాత 17 వేల మెగావాట్లకు

పెంచినట్లు తెలిపారు. కేంద్రం విద్యుత్ సంస్కరణల పేరుతో ప్రవేట్ ఆపరేటర్ల కు ఇచ్చేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలిపారు. ప్రవేటీకరణ జరిగితే ఇరువై లక్షల మంది ఉద్యోగులు రోడ్డున పడే పరిస్థితి ఉన్నట్లు తెలిపారు. విద్యుత్ ప్రవేట్ పరమైతే పేదలకు, రైతులకు ఇచ్చే ఉచిత విద్యుత్ ను రాష్ట్ర ఇవ్వలేదని అన్నారు. కేంద్రం చేసే కుట్రలను తిప్పికొట్టేందుకు సిద్ధంగా ఉండాలని సూచించారు. రైతు సంక్షేమంగా ప్రభుత్వం పని చేస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీలు నామా నాగేశ్వరరావు, వద్ధిరాజు రవిచంద్ర, ఎమ్మేల్యే కందాళ ఉపేందర్రెడ్డి, ఎమ్మేల్సీ తాతా మధుసూధన్, రైతు సమన్వయ సమితి జిల్లా అధ్యక్షుడు నల్లమల్ల వెంకటేశ్వరరావు.

డీసీసీబీ చైర్మన్ కురాకుల నాగేశ్వరరావు, జడ్పీ వైస్ చైర్మన్ మరికంటి

ధనలక్ష్మి, డీసీఎంఎస్ డైరెక్టర్ నాగుబండి శ్రీనివాసరావు, చెరకు అభివృద్ధి

మండలి చైర్మన్ నెల్లూరి లీలాప్రసాద్, ఎంపీపీ వజ్జా రమ్య, రైతు

సమన్వయ సమితి అధ్యక్షుడు శాఖమూరి సతీష్, ఆయా పంచాయతీ

సర్పంచ్ లు, ఎంపీటీసీలు, వివిధ శాఖల అధికారులు తదితరులు

పాల్గొన్నారు.

Next Story
Share it