Sneha TV
తెలంగాణ

రాయికల్ పట్టణ సమీకృత మార్కెట్ స్థల పరిశీలన చేసిన- అదనపు కలెక్టర్లు

రాయికల్ పట్టణ సమీకృత మార్కెట్ స్థల పరిశీలన చేసిన- అదనపు కలెక్టర్లు
X

రాయికల్,సెప్టెంబర్ 22 (ప్రజాపాలన ప్రతినిధి): రాయికల్ పట్టణ సమీకృత కూరగాయల, మాంసాహార మార్కెట్ స్థల ఎంపిక, ఏర్పాటు కొరకై జిల్లా అదనపు కలెక్టర్ బి.ఎస్. లత, స్థానిక సంస్థల జిల్లా అదనపు కలెక్టర్ అరుణ్రీ లు స్థలాన్ని సందర్శించి, 3కోట్ల రూ.లతో నిర్మించదలచిన మార్కెట్ పనులను త్వరలోనే ప్రారంభించడానికి స్థల సేకరణ తదుపరిచర్యలు తీసుకోవాలని స్థానిక అధికారులను ఆదేశించారు. అదనపు కలెక్టర్ల వెంట మున్సిపల్ చైర్మన్,వైస్ చైర్మన్,కమిషనర్ సంతోష్ కుమార్, రాయికల్ ఇన్చార్జితహసిల్దార్ అనిల్, డివిజనల్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ అభినయ్,అసిస్టెంట్ ఇంజనీర్ ప్రసాద్, మున్సిపల్ కౌన్సిలర్లు, కార్యాలయసిబ్బంది ఉన్నారు.

Next Story
Share it