Sneha TV
తెలంగాణ

గ్రామాభివృద్ధికి దివిస్ సహకారం అభినందనీయం -- సర్పంచ్ ఆకుల సునీత

గ్రామాభివృద్ధికి దివిస్ సహకారం అభినందనీయం            -- సర్పంచ్ ఆకుల సునీత
X

చౌటుప్పల్, సెప్టెంబర్ 22 (ప్రజాపాలన ప్రతినిధి): గ్రామాభివృద్ధికి దివిస్ పరిశ్రమ అందిస్తున్న ఆర్థిక సహకారం అభినందనీయమని ఎస్ లింగోటం, సర్పంచ్ ఆకుల సునీత అన్నారు. చౌటుప్పల్ మండలంలోని ఎస్ లింగోటం, గ్రామాలలో ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు రూ.5,72,000/- రూపాయల విలువ చేసే నోట్ బుక్స్,స్కూల్ బ్యాగ్,వాటర్ బాటిల్స్,షూస్,హార్లిక్స్ ప్యాకెట్లను దివిస్ పరిశ్రమ యాజమాన్యం అందజేశారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రామాన్ని దివిస్ పరిశ్రమ అన్ని విధాలుగా అభివృద్ధి చేయడానికి సహకారం అందిస్తున్నారని తెలిపారు. విద్యార్థులకు అవసరమైన సామాగ్రిని పాఠశాలలకు అందిస్తూ,విద్యాభివృద్ధికి కృషి చేయడం జరుగుతుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ ఉప్పం భద్రయ్య, గ్రామ ఉపసర్పంచ్ గంగాపురం గంగాధర్, వార్డు సభ్యులు, ప్రధానోపాధ్యాయులు శ్రీ వెంకటరెడ్డి, ఉపాధ్యాయుని, ఉపాధ్యాయులు మరియు డివిస్ సిఎస్ఆర్ ఇన్చార్జ్ వల్లూరి వెంకట్ రాజు, సాయి కృష్ణ, తదితరులు పాల్గొన్నారు,

Next Story
Share it