Sneha TV
తెలంగాణ

సింగరేణి లేడీస్ క్లబ్ ఆధ్వర్యంలో ఆరిఫా అండ్ రోష్ని వృద్ధాశ్రమానికి , బియ్యం నిత్యవసర వస్తువులు అందజేత.....

సింగరేణి లేడీస్ క్లబ్ ఆధ్వర్యంలో  ఆరిఫా అండ్ రోష్ని వృద్ధాశ్రమానికి , బియ్యం  నిత్యవసర వస్తువులు అందజేత.....
X

. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండలం..

మణుగూరు ఏరియా సింగరేణి లేడీస్ క్లబ్ ఆధ్వర్యంలో అశ్వాపురం ఆరిఫా అండ్ రోష్ని వృద్ధాశ్రమానికి గురువారం నాడు రెండు క్వింటాళ్ల బియ్యం నిత్యవసర వస్తువులను వితరణగా అందజేసి తమ ఔదార్యాన్ని చాటుకున్నారు మణుగూరు ఏరియా నూతన సేవా అధ్యక్షురాలు శ్రీమతి గోపవరం సునీత వెంకటేశ్వర్ రెడ్డి గారు ముఖ్య అతిథిగా మాజీ సేవా అధ్యక్షురాలు శ్రీమతి జక్కం వాణి రమేష్ గారు విశిష్ట అతిథులుగా కార్యక్రమానికి హాజరై వృద్ధాశ్రమం నిర్వాహకులకు బియ్యం నిత్యవసర వస్తువులను అందజేశారు వృద్ధులకు పండ్లు పంపిణీ చేశారు, లేడీస్ క్లబ్ ఆధ్వర్యంలో పెద్దిపల్లి ,రేగుల గండి ,రాయన్నపేట, ఇటీవల అగ్రి ప్రమాదానికి గురైన శనగకుంట గ్రామాలకు అందజేసిన సహకారంతోపాటు బాల వెలుగు పాఠశాలలో నిర్వహించిన పలు కార్యక్రమాల నిర్వహణలో సభ్యుల సహకారాన్ని వీటితోపాటు ఆరిఫా అండ్ రోష్ని వృద్ధాశ్రమం నిర్వహణ వారి ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని నిర్వాహకుల అభ్యర్థన మేరకు లేడీస్ క్లబ్ ఆధ్వర్యంలో ప్రతినెల వృద్ధాశ్రమానికి ఎంతో కొంత సహకారం అందించాలనీ భావించామని అందులో భాగంగా రెండవ విడతగా ఈ వితరణ కార్యక్రమం చేపట్టామని ఈ కార్యకలాపాలలో లేడీస్ క్లబ్ సభ్యుల సహకారం వారి చురుకైన పాత్రను మాజీ సేవా అధ్యక్షురాలు శ్రీమతి వాణి రమేష్ దంపతుల ప్రోత్సాహాన్ని ఆమె నూతన సేవా అధ్యక్షురాలికి లేడీస్ క్లబ్ కార్యదర్శి ప్రముఖ పాత్రికేయురాలు అనిత వివరించారు, ఈ సందర్భంగా శ్రీమతి సునీత వెంకటేశ్వర రెడ్డి గారు మాట్లాడుతూ పని సంస్కృతిలో అగ్రగామిగా ఉంటూనే పరుల సేవలో కూడా మణుగూరు ఉద్యోగులు వారి కుటుంబ సభ్యులు తమ ప్రత్యేకతను చాటుకుంటున్నారని ఇది తనకు ఎంతగానో ప్రేరణ ఇచ్చిందని లేడీస్ క్లబ్ సభ్యుల సామాజిక సేవలు స్ఫూర్తిదాయకమని ఇదే విధంగా భవిష్యత్తులో క్లబ్ సభ్యుల సహకారంతో మరిన్ని సేవా కార్యక్రమాలు చేపట్టాలని ఆమె వారిని ప్రోత్సహిస్తూ ఎంతో ఉత్సాహంగా మాట్లాడారు, మాజీ సేవా అధ్యక్షురాలు శ్రీమతి వాణి రమేష్ మాట్లాడుతూ లేడీస్ క్లబ్ సభ్యులు వినూత్నమైన సేవా కార్యక్రమాలతో తోబుట్టువుల్లా తనకు ఎంతగానో సహకరించారని ఆ సంతృప్తితో కొత్తగూడెం బదిలీపై వెళుతున్నామని వారి సంకల్పానికి అభినందనలు తెలియజేసారు,మణుగూరు ఏరియా నూతనంగా సేవా అధ్యక్షురాలిగా బాధ్యతలు చేపట్టిన మేడం సునీత గారికి కూడా అలాంటి సహకారాన్ని అందించాలని ఆమె క్లబ్ సభ్యుల్ని కోరారు, ఈ కార్యక్రమంలో లేడీస్ క్లబ్ కార్యదర్శి శ్రీమతి D అనిత లలిత్ కుమార్, శ్రీమతి సుస్మిత ఫీట్జ్ రాల్డ్ , శ్రీమతి కవిత శ్రీనివాస్ చారి ,శ్రీమతి J అనురాధా వీరభద్రుడు, శ్రీమతి సుజాత రవీందర్ ,శ్రీమతి శారద పి ఆర్ కె రావు సింగరేణి సేవా సమితి సభ్యులు sd నా సర్ పాషా, వృద్ధాశ్రమం నిర్వాహకులు

షేహనాజ్, మెహారాజ్ తదితరులు పాల్గొన్నారు.Next Story
Share it