Sneha TV
తెలంగాణ

ఆశ వర్కర్లకు చీరలు పంపిణీ చేసిన మున్సిపల్ చైర్పర్సన్

ఆశ వర్కర్లకు చీరలు పంపిణీ చేసిన మున్సిపల్ చైర్పర్సన్
X

కోరుట్ల, సెప్టెంబర్ 22 (ప్రజాపాలన ప్రతినిధి): వైద్యరంగంలో విశిష్ట సేవలు అందిస్తున్న ఆశా వర్కర్ల కోసం తెలంగాణ ప్రభుత్వం అందించిన డ్రెస్ కోడ్, యూనిఫామ్ చీరలను కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్ రావు ఆదేశాల మేరకు గురువారం రోజున కోరుట్ల పట్టణంలోని ఆశ వర్కర్లకు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మున్సిపల్ చైర్ పర్సన్ అన్నం లావణ్య అనిల్ వైద్య అధికారులతో కలిసి పంపిణీ చేశారు.ఈ కార్యక్రమంలో జిల్లా ప్రోగ్రామ్ ఆఫీసర్ జైపాల్ రెడ్డి, జిల్లా రైతు సమితి అధ్యక్షులు చీటీ వెంకటరావు, మున్సిపల్ వైస్ చైర్మన్ గడ్డమీద పవన్, ఎంపీపీ తోట నారాయణ, వైద్య అధికారులు, సూపర్ వైజర్ ధనంజయ్, మరియు ఆశా వర్కర్లు తదితరులు పాల్గొన్నారు.

Next Story
Share it