Sneha TV
తెలంగాణ

దసరా ఉత్సవానికి బతుకమ్మ చీరలు పంపిణీ

దసరా ఉత్సవానికి బతుకమ్మ చీరలు పంపిణీ
X

విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి

వికారాబాద్ బ్యూరో 22 సెప్టెంబర్ ప్రజాపాలన : ప్రపంచంలోనే ఎక్కడా లేనివిధంగా పూలను పూజిస్తూ మహిళలు అత్యంత భక్తి శ్రద్ధలతో,వైభవంగా జరుపుకునే బతుకమ్మ,దసరా పండుగకు ముందస్తుగా విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. గురువారం వికారాబాద్ జిల్లా కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో జరిగిన బతుకమ్మ చీరల పంపీణి కార్యక్రమానికి ముఖ్య అతిధిగా హాజరై మహిళలకు చీరలు పంపిణీ చేసిన విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి. ఈ సందర్భంగా మంత్రి సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ..చీర ఖరీదు,రంగులు చూడొద్దని ఒక అన్నలాగా కేసీఆర్ ప్రేమాభిమానం ఈ చిరు కానుకలో చూసుకోవలన్నారు. గతంలో ఉన్న ఏ ప్రభుత్వాలు కూడా ఇలాంటి చిరు కానుకలు ఇవ్వలేదని ముఖ్యమంత్రి ఆప్యాయత అనురాగలు ఒక వైపు ఉంటే నేతన్నల కష్టం మరో వైపు ఉందన్నారు. కోటి బతుకమ్మ చీరల పంపిణీ రాష్ట్ర వ్యాప్తంగా చేపడుతున్నట్లు మంత్రి పేర్కొన్నారు.

ఈ సంవత్సరం 24 విభిన్న డిజైన్లు 10 రకాల ఆకర్షణీయమైన రంగులలో మొత్తం 240 రకాల త్రెడ్ బోర్డర్ (దారపు పోగుల అంచుల) తో చీరలు తయారీ చేయటం జరిగిందని వివరించారు. బతుకమ్మ చీరల కార్యక్రమంతో నేత కార్మికుల జీవితాల్లో వెలుగులు నిండాయని గుర్తు చేశారు.

తెలంగాణ ప్రభుత్వం రాష్టంలోని నేతన్నలకు చేయూతనివ్వడంతోపాటు, ఆడబిడ్డలకు ప్రేమపూర్వక చిరుకానుక ఇవ్వాలన్న గొప్ప లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ 2017లో ప్రారంభించారు.

బతుకమ్మ చీరల పంపిణీతో అటు ఆడబిడ్డలకు ఆనందంతో పాటు ఏడాది పొడవునా నేతన్నలకు ఉపాధి భరోసా దొరికిందన్నారు. ఈ ఏడాది గతంలో కన్నా మరిన్ని ఎక్కువ డిజైన్లు, రంగుల, వెరైటీల్లో ఈ చీరలను తెలంగాణ టెక్స్టైల్ శాఖ తయారు చేసిందని స్పష్టం చేశారు.

సిరిసిల్లలో 16 వేల మంది నేతన్నలకు గౌరవ ప్రదమైన ఉపాది కల్పిస్తున్న ఈ బతుకమ్మ చీరల ప్రాజెక్టు కొరకు మొత్తం రూ. 339.73 కోట్లను తెలంగాణ ప్రభుత్వం ఖర్చు చేయగా గత సంవత్సరం 333 కోట్లు మాత్రమే ఖర్చు అయ్యిందన్నారు. ఈ కార్యక్రమం ప్రారంభం అయిన నాటి నుంచి ఇప్పటిదాకా (ఈసంవత్సరం కలుపుకుని) సూమారు 5 కోట్ల 81 లక్షల చీరలను ఆడబిడ్డలకు అయిదు దఫాలుగా ప్రభుత్వం అందజేసింది.1802 కోట్ల రూపాయల భారీ నిధులు ఖర్చు చేసింది. వికారాబాద్ జిల్లాలో 288000 చీరలు పంపిణీ చేయనున్నామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జడ్పీ చైర్ పర్సన్ సునీతా రెడ్డి, ఎమ్మెల్యేలు డాక్టర్ మెతుకు ఆనంద్, కొప్పుల మహేశ్వర్ రెడ్డి, కలెక్టర్ నిఖిల, ఎస్పీ కోటి రెడ్డి, జడ్పీ సి ఈ ఓ జానకిరెడ్డి, జడ్పీ వైస్ చైర్మన్ విజయ్ కుమార్, డిఆర్డిఏ పిడి కృష్ణన్ ఇంచార్జ్ డిఆర్ఓ అశోక్ కుమార్ మహిళలు పాల్గొన్నారు.

Next Story
Share it