Sneha TV
తెలంగాణ

తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ ప్రతినిధి గా చిలుక మధుసూదన్ రెడ్డి నియమకం* *పట్నం లో కాంగ్రెస్ పార్టీ నీ మరింత బలోపేతం చేస్తా...మధుసూదన్ రెడ్డి* *తన నియామకానికి సహకరించిన టిపిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి కి ఇబ్రహీంపట్నం ముద్దుబిడ్డ మల్ రెడ్డి రంగారెడ్డి కి కృతజ్ఞతలు...మధుసూదన్ రెడ్డి*

తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ ప్రతినిధి గా చిలుక మధుసూదన్ రెడ్డి నియమకం*    *పట్నం లో కాంగ్రెస్ పార్టీ నీ మరింత బలోపేతం చేస్తా...మధుసూదన్ రెడ్డి*    *తన నియామకానికి సహకరించిన టిపిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి కి ఇబ్రహీంపట్నం ముద్దుబిడ్డ మల్ రెడ్డి రంగారెడ్డి కి కృతజ్ఞతలు...మధుసూదన్ రెడ్డి*
X

తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమటీ ప్రతినిధి గా ఇబ్రహీంపట్నం నియోజకవర్గం అబ్దుల్లాపూర్ మెట్ మండలం అనాజ్ పూర్ గ్రామానికి చెందిన చిలుక మధుసూదన్ రెడ్డి నీ నియమించడం జరిగింది..టీపీసీసి ఇబ్రహీంపట్నం ప్రతినిధులు గా మల్ రెడ్డి రంగారెడ్డి తో పాటు చిలుక మధుసూదన్ రెడ్డి నీ అధిష్టానం నియమించడం జరిగింది..

టీపీసీసి అద్యక్షులు శ్రీ ఎనుముల రేవంత్ రెడ్డి గారికి ముఖ్య అనుచరుడు గా ఉన్న చిలుక మధుసూదన్ రెడ్డి నీ నియమించడం పట్ల కాంగ్రెస్ పార్టీ శ్రేణులు హర్షం వ్యక్తం చేశారు..మధుసూదన్ రెడ్డి గతంలో తెలుగుదేశం పార్టీ విద్యార్థి విభాగం రాష్ట్ర అధ్యక్షుడు గా పని చేసి ప్రబుత్వ వ్యతిరేక కార్యక్రమాలలో కీలకంగా పనిచేశారు.విద్యార్థి..నిరుద్యోగ సమస్యల పట్ల పెద్ద ఎత్తున పోరాటం చేసి వారి సమస్యల సాధన లో క్రియాశీల పాత్ర వహించడం జరిగింది ..వారి సమస్యల పట్ల జైలు కి అనేక సార్లు వెళ్లిన సందర్బాలు ఉన్నాయి..పలు కేసులు కూడా అతని పైన ఇంకా ఉన్నాయి..అయితే అప్పట్లో రేవంత్ రెడ్డి తో పాటు మధుసూదన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ చీఫ్ శ్రీ రాహుల్ గాంధీ సమక్షం లో కాంగ్రెస్ లో చేరడం జరిగింది..అప్పటినుండి నేటి వరకు ఇబ్రహీంపట్నం నియోజీకవర్గం లో పార్టీ సీనియర్ నాయకులు మల్ రెడ్డి రంగారెడ్డి నాయకత్వం లో పనిచేస్తున్నారు...శ్రీ ఎనుముల రేవంత్ రెడ్డి ఏ కార్యక్రమం పిలుపు ఇచ్చిన మధుసూదన్ రెడ్డి బృందం క్రియాశీలకంగా పాల్గొని విజయవంతం చేయడం లో ముందు ఉండటం జరుగుతుంది..అయితే గురువారం రోజున నియోజకవర్గం ప్రజాప్రతినిధుల ని ముఖ్యనాయకుల నీ కలిసి ఆశీస్సులు పొందడం జరిగింది .

ఈ సందర్భంగా *కాంగ్రెస్ పార్టీ యువ నాయకులు చిలుక మధుసూదన్ రెడ్డి మాట్లాడుతూ*…కాంగ్రెస్ పార్టీ అధిష్టానం తనను టిపిసిసి నూతన ప్రతినిధిగా నియమించినందుకు ముఖ్యంగా *TPCC అధ్యక్షులు నా అభిమాన నాయకుడు శ్రీ ఎనుముల రేవంత్ రెడ్డి గారికి.. మరియు ఇబ్రహీంపట్నం ముద్దుబిడ్డ శ్రీ మల్ రెడ్డి రంగారెడ్డి గారికి* హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేయడం జరిగింది.. రాబోయే రోజుల్లో ఇబ్రహీంపట్నం నియోజకవర్గం లో కాంగ్రెస్ పార్టీ నీ గెలిపించడంలో సైనికుడు లాగా పని చేస్తానని కార్యకర్తలకు నాయకులకు ఎల్లవేళలా అండగా ఉంటానని తెలియజేశారు.. ప్రజా సమస్యలపై నిరంతరం పార్టీ పిలుపునిచ్చిన కార్యక్రమాలను విజయవంతం చేస్తామని,ప్రజలను దోచుకుంటున్న అవినీతి ప్రభుత్వాలు బిజెపి టిఆర్ఎస్ పార్టీలను గద్దే దించేవరకు పోరాటం చేస్తానని చెప్పారు..అతి చిన్న వయసులో నాపై నమ్మకం ఉంచి బాధ్యతలు అప్పగించిన కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నానను.


Next Story
Share it