Sneha TV
తెలంగాణ

కిషోర్ కుమార్ పీసీసీ సభ్యులుగా ఎంపిక పట్ల మండల కాంగ్రెస్ పార్టీ హర్షం

కిషోర్ కుమార్ పీసీసీ సభ్యులుగా ఎంపిక పట్ల మండల కాంగ్రెస్ పార్టీ హర్షం
X

బోనకల్, సెప్టెంబర్ 21 ప్రజా పాలన ప్రతినిధి: మండల పరిధిలోని కలకోట గ్రామానికి చెందిన సీనియర్ కాంగ్రెస్ నాయకులు,జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యదర్శి పైడిపల్లి కిషోర్ కుమార్ రాష్ట్ర ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ మెంబర్ గా ఎంపికవడంతో మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కిషోర్ కుమార్ ఎన్నిక పట్ల రాష్ట్ర పిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డికి, మధిర శాసనసభ్యులు సిఎల్పీ నాయకులు మల్లు భట్టి విక్రమార్క కి, డిసిసి అధ్యక్షులు పువాళ్ళ దుర్గాప్రసాద్ కి కృతజ్ఞతలు తెలిపారు. కిషోర్ కుమార్ గ్రామ సర్పంచ్ నుంచి ఎంపీటీసీ సొసైటీ చైర్మన్, కార్యదర్శిగా పలు పదవులను అధిరోహించి ప్రస్తుతం టీపీసీసీ మెంబర్గా ఎన్నికవ్వడం పట్ల మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు హర్షం వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గాలి దుర్గారావు, డిసిసి కార్యదర్శి బందం నాగేశ్వరావు, వైస్ ఎంపీపీ గుగులోత్ రమేష్,కలకోట సహకార సంఘం అధ్యక్షులు కర్నాటి రామకోటేశ్వరరావు, చిరునోముల సర్పంచ్ ముల్కారాపు రవి, ఉప సర్పంచ్ ఆముదాల పుల్లారావు,మండల ఎస్సీ సెల్ అధ్యక్షులు మార్పుల ప్రేమ్ కుమార్, బీసీ సెల్ అధ్యక్షులు కందుల పాపారావు,మండల అధ్యక్షులు నల్లమోతు సత్యనారాయణ, కుటుంబరావు, శాస్త్రి, యూత్ కాంగ్రెస్ నాయకులు బద్రు నాయక్, జట్టెం పుల్లయ్య తదితరులు పాల్గొన్నారు.

Next Story
Share it