Sneha TV
తెలంగాణ

అసరా పెన్షన్ కార్డులను పంపిణీ చేసిన సర్పంచ్ .

అసరా పెన్షన్ కార్డులను పంపిణీ చేసిన  సర్పంచ్ .
X

జన్నారం, సెప్టెంబర్ 21, ప్రజాపాలన: మండలంలోని లింగయ్య పల్లి గ్రామ పంచాయతీ కార్యాలయంలో నూతనంగా మంజూరైన అసరా పెన్షన్ కార్డులను సర్పంచ్ బోర్లకుంటా లావణ్య చేతుల మీదుగా పంపిణీ చేయడం జరిగింది. బుధవారం మంచిర్యాల జిల్లా జన్నారం మండలం లింగయ్య పల్లి గ్రామ పంచాయతీ కార్యాలయం ఆవరణలో దివ్యాంగులు, వయెావృద్దులు, ఒంటరి, బీడి చేనేత, గీతా, కార్మికులకు, నూతన పెన్షన్ దారులు హజరై అసరా పెన్షన్ కార్డులను తీసుకున్నారు. ఈ కార్యాక్రమంలో కారోబార్ రాజు, పంచాయతీ సెక్రటరీ ప్రసాద్, వార్డు సభ్యులు, పంచాయతీ సిబ్బంది, కార్యకర్తలు, వయెావృద్దులు, తదితరులు పాల్గొన్నారు.

Next Story
Share it