Sneha TV
తెలంగాణ

మండలంలో ఉచిత కుట్టుశిక్షణ తరగతులు ప్రారంభం..

మండలంలో ఉచిత కుట్టుశిక్షణ తరగతులు ప్రారంభం..
X

తల్లాడ, సెప్టెంబర్ 21 (ప్రజా పాలన న్యూస్):

జనశిక్షణ సంస్థాన్ ఆధ్వర్యంలో బుధవారం తల్లాడ మండలం కొత్త వెంకటగిరి, బిల్లుపాడు, గూడూరు, రాంచంద్రపురం గ్రామ పంచాయతీలలో ఉచిత టైలరింగ్ తరగతులను జనశిక్షణ సంస్థాన్ ఖమ్మం జిల్లా డైరెక్టర్ వై రాధాకృష్ణ చేతుల మీదుగా ప్రారంభించారు. ఈ సందర్భంగా డైరెక్టర్ మాట్లాడుతూ భారత ప్రభుత్వం మానవ వనరుల నైపుణ్యాల అభివృద్ధి మంత్రిత్వ శాఖ వారిచే సర్టిఫికెట్స్ అందజేయడం జరుగుతుందని తెలియజేశారు. ఖమ్మం జిల్లాలో అన్ని మండలాల్లో, గ్రామాలలో 15 రకాల ఉచిత ట్రైనింగ్స్ కోర్సులు అందించడం జరుగుతున్నదన్నారు. ఖమ్మం జిల్లా లోని మహిళలు , పురుషులు,యువతీ,యువకులు ఈ ప్రోగ్రామ్స్ ను సద్వినియోగం చేసువాలని, స్వయం ఉపాధి పొందాలని, ఆర్థికంగా అభివృద్ధి పొందాలని తెలియజేశారు.ఈసందర్బంగా లబ్దిదారులకు సమగ్రమైన ప్రణాళికతో శిక్షణ తరగతులు నిర్వహిస్తున్న రిసోర్స్ పర్సన్స్ కు ప్రత్యేకంగా అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో జనశిక్షన్ సంస్థాన్డైరెక్టర్,రిసోర్స్ పర్సన్స్, స్టాఫ్, గ్రామ పంచాయతీ ప్రెసిడెంట్స్, సెక్రెటరీస్ గ్రామ పెద్దలు పాల్గొన్నారు.

Next Story
Share it