Sneha TV
తెలంగాణ

రైల్వే భూ నిర్వాసిత రైతులని అన్ని విధాలుగా ఆదుకుంటాము... తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ శ్రీ రేగా కాంతారావు గారు*

రైల్వే భూ నిర్వాసిత రైతులని అన్ని విధాలుగా ఆదుకుంటాము... తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ శ్రీ రేగా కాంతారావు గారు*
X

ఈరోజు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు మండలంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం నందు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ & పినపాక శాసనసభ్యులు & భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు శ్రీ రేగా కాంతారావు గారితో బుధవారం నాడు మణుగూరు BTPS బొగ్గు రవాణా కోసం నిర్మించినటువంటి రైల్వే లైన్ నిర్మాణంలో భూములు పోయినటువంటి రైతులు ప్రత్యేక సమావేశం అయ్యారు.ఈ సందర్భంగా భూ నిర్వాసితులు మాట్లాడుతూ వారు తమ భూములు కోల్పోయామని ఇప్పటివరకు కూడా ఎటువంటి నష్టపరిహారం మాకు అందలేదని రేగాకాంతారావు గారి దగ్గర సమావేశంలో వివరించారు. ఇకనైనా ప్రభుత్వం ఆదుకొని మాకు త్వరితగతిన నష్టపరిహారం ఇప్పించవలసిందిగా భూనిర్వర్సితులు కోరుకున్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ శ్రీ రేగా కాంతారావు గారు మాట్లాడుతూ రైల్వే భూ నిర్వాసిత రైతులని అన్ని విధాలుగా ఆదుకుంటామని, ప్రభుత్వంతోని మాట్లాడి మెరుగైన ప్యాకేజీ అందించేందుకు కృషి చేస్తానని, రైతులకు భరోసా కల్పించారు...

Next Story
Share it