Sneha TV
తెలంగాణ

కుటుంబ బాంధవ్యాలకు బలమైన పునాది రక్షాబంధనం

కుటుంబ బాంధవ్యాలకు బలమైన పునాది రక్షాబంధనం
X

రాయికల్, ఆగస్టు 12 (ప్రజాపాలన ప్రతినిధి):

సనాతన భారతీయ ధర్మ సంప్రదాయంలో

మనం ఆచరించే ప్రతి పండగకీ ఆచారం, పరమార్థం ఉంటూ, విశ్వమానవ కళ్యాణానికి, సర్వమానవ సౌభ్రాతృత్వానికి దారి చూపించును.

పురాణ ఇతిహాసాలలో మనం తెలుసుకున్న ప్రకారం అతి ప్రాచీనమైన అపురూప కుటుంబ బాంధవ్యాల పండగ రాఖీపండగ.శ్రావణమాస పౌర్ణమి నాడు జరుపుకునే దివ్యమైన వేడుక అన్నాచెల్లెళ్ల అనుబంధానికి ప్రతీక "జంధ్యాల పౌర్ణమిగా పిలవబడే రాఖీ పౌర్ణమి వేడుక"పురాణాల ప్రకారం త్రీభువనాలకు అధిపతి అయిన దేవేంద్రునికి ధైర్యం నింపుతూ,అతని పట్టపురాణి ఇంద్రాణి త్రిమూర్తులను ఆరాధించి సర్వ శక్తిని తన రక్షాబంధనం రూపంలో దేవేంద్రుని చేతికి కట్టి, ఇంద్రుడు రాక్షసులపై విజయం సాధించేలా చేసిన పురాణకథ మనకు నేటికీ ఆదర్శం.అన్నాచెల్లెళ్ల అనుబంధానికి శాశ్వత ప్రతీక శ్రీ కృష్ణ, ద్రౌపది అనుబంధాన్ని తెలిపే ఇతివృత్తం,

కౌరవ దుశ్శాసన కీచక పర్వంలో నిస్సహాయురాలైన ద్రౌపది స్వాభిమానానికి అండగా నిలిచిన సోదరిపట్ల,సోదరునికి ఉన్నా అనంతమైన బాధ్యతను గుర్తుచేసే అపురూప బంధం రక్షాబంధనం. విశ్వ విజేత కావాలనే దూకుడుతో క్రీస్తుపూర్వం 326 లో మారణహోమం సృష్టించిన గ్రీకు వీరుడు అలెగ్జాండర్ కు ప్రాణభిక్ష పెట్టమని ఆయన భార్య రుక్సానా ఆఫ్ఘనిస్తాన్ యువరాణి అప్పటి మన భారత దేశ పాలకుడైన పురుషోత్తముడిని సోదరునిగా భావించి

మన సనాతన ధర్మంలో అన్నా చెల్లెల అనుబంధానికి ఉన్న శక్తిని తెలుసుకుని తన భర్తను వదిలి వేయమని రక్షాబంధనాన్ని పంపిన చరిత్ర మనకు తెలుసు,

ఇలా నేటికి కూడా ఎన్ని యుగాలైనా మారని అనుబంధానికి ప్రతీకరక్షాబంధన్.

నేటి హరి,భరీ ఆధునిక జీవనకుటుంబంలో ఉన్న తోబుట్టువులకు సమయం లేదని భావిస్తున్న తరుణంలో ప్రత్యేకంగా ఈ రాఖీ పండగ రోజు మాత్రం ఎక్కడ ఉన్నా,ఎంత దూరం ఉన్నా అన్నాచెల్లెళ్లు ఒకే గూటికి చేరే అపూర్వ వేడుక (రాఖీ పౌర్ణమి) ఈ రక్షాబంధన్.

Next Story
Share it