Sneha TV
తెలంగాణ

కరీంనగర్ అసెంబ్లీ బీజేవైఎం "తిరంగా "బైక్ ర్యాలీ కి కదిలి రండి..

కరీంనగర్ అసెంబ్లీ  బీజేవైఎం   తిరంగా బైక్ ర్యాలీ కి కదిలి రండి..
X

కరీంనగర్ ఎన్టీఆర్ చౌరస్తా నుండి తిరంగా ర్యాలీ

బీజేవైఎం రాష్ట్ర ఉపాధ్యక్షుడు దురిశెట్టి సంపత్...

కరీంనగర్ ఆగస్టు 12 ప్రజాపాలన :

75 ఏళ్ల స్వాతంత్ర వజ్రోత్సవ వేడుకలు ,ఆజాది కా అమృత్ మహోత్సవ్ కార్యక్రమంలో భాగంగా కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా భారతీయ జనతా యువమోర్చా ఆధ్వర్యంలో భారీ తిరంగా ర్యాలీలకు అన్ని అసెంబ్లీ, మండల కేంద్రాలలో తగిన ఏర్పాట్లు జరిగాయని, శనివారం కరీంనగర్ అసెంబ్లీ పరిధిలో జరిగే తిరంగా ర్యాలీకి కూడా ఏర్పాట్లు పూర్తయినందున బీజేవైఎం శ్రేణులు, యువకులు తరలివచ్చి విజయవంతం చేయాలని బీజేవైఎం రాష్ట్ర ఉపాధ్యక్షుడు దురిశెట్టి సంపత్ పిలుపునిచ్చారు. శుక్రవారం కరీంనగర్లో ఆయన మాట్లాడుతూ 75 ఏళ్ల స్వతంత్ర వజ్రోత్సవ వేడుకలను పండుగలా జరుపుకోవడానికి , దేశ సమైక్యతను కీర్తిని చాటి చెప్పడానికే తిరంగా యాత్ర జరుగుతుందని చెప్పారు . ముఖ్యంగా యువత దేశ స్వాతంత్రం గురించి ఆలోచన చేసి, దేశభక్తి కలిగి ఉండడానికి ఆజాది కా అమృత్ మహోత్సవ్ కార్యక్రమాలు ఎంతో దోహద పడే అవకాశం ఉన్నందున తిరంగా ర్యాలీలో యువతను భాగస్వామ్యం చేయాలని ఆయన కోరారు . కరీంనగర్ అసెంబ్లీ పరిధిలోని బీజేవైఎం శ్రేణులు, యువకులు ఉదయం 10 గంటలవరకు బైపాస్ రోడ్ లోని ఎన్టీఆర్ చౌరస్తా వద్దకు చేరుకోవాలని, తిరంగా ర్యాలీ ఎన్టీఆర్ చౌరస్తా నుండి పట్టణంలోని పలు ముఖ్యమైన ప్రాంతాల మీదుగా కొనసాగుతుందని తెలిపారు . అలాగే మానకొండూర్, చొప్పదండి, హుజురాబాద్ అసెంబ్లీ నియోజకవర్గాల్లో, అన్ని మండల కేంద్రాల్లో బీజేవైఎం బాధ్యులు తిరంగా ర్యాలీలు ఘనంగా నిర్వహించి విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు.

Next Story
Share it