Sneha TV
తెలంగాణ

తీజ్ ఉత్సవాలలో ఎమ్మెల్యే రేఖా నాయక్

తీజ్ ఉత్సవాలలో ఎమ్మెల్యే రేఖా నాయక్
X

జన్నారం, ఆగస్టు 12, ప్రజాపాలన: మంచిర్యాల జిల్లా జన్నారం మండలంలోని గ్రామం జువ్వి గూడ లో నిర్వహించిన తీజ్ ఉత్సవాల్లో గురువారం రోజు ఎమ్మెల్యే రేఖా నాయక్ పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ శ్రావణ మాసంలో గిరిజన మహిళలు అంతా కలిసి ఘనంగా నిర్వహించుకునే తీజ్ పండుగ గిరిజన సాంస్కృతిక వైభవానికి నిదర్శనమని అన్నారు. లంబాడా గిరిజన ఆడబిడ్డలందరూ సుఖసంతోషాలు, ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని, భగవంతుని ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని కోరారు. అనంతరం లంబాడా గిరిజనులకు తీజ్ పండుగ శుభాకాంక్షలను చెప్పారు. ఈ కార్యక్రమంలో వైస్ ఎంపీపీ సుతారి వినయ్ టిఆర్ఎస్ మండల అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు గుర్రం రాజారాంరెడ్డి, గోట్లా రాజేష్ యాదవ్, మార్కెట్ కమిటీ చైర్మన్, వైస్ చైర్మన్ లు సీపతి బుచ్చన్న, భరత్ కుమార్, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ ముత్యం సతీష్, ప్యాక్స్ ఛైర్మెన్ శీలం రమేష్ తదితరులు పాల్గొన్నారు.

Next Story
Share it