Sneha TV
తెలంగాణ

భాస్కర్ గౌడ్ పై దాడి చేసిన వారిని కఠినంగా శిక్షించాలి ... బిజెపి జిల్లా అధ్యక్షుడు ఎర్రబెల్లి రఘునాధరావు

భాస్కర్ గౌడ్ పై దాడి చేసిన వారిని  కఠినంగా శిక్షించాలి    ... బిజెపి జిల్లా అధ్యక్షుడు ఎర్రబెల్లి రఘునాధరావు
X

బెల్లంపల్లి ఆగస్టు 12 ప్రజా పాలన ప్రతినిధి: మంచిర్యాల జిల్లా తాండూరు మండల జెపిపి ప్రధాన కార్యదర్శి తాళ్లపల్లి భాస్కర్ గౌడ్ పై ట దాడి చేయడం అమానుషమైన చర్య అని, దాడి చేసిన వారిని తక్షణమే అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలని మంచిర్యాల జిల్లా బిజెపి అధ్యక్షులు ఎర్రబెల్లి రఘునాధ రావు అన్నారు. శుక్రవారం మంచిర్యాల ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న భాస్కర్ గౌడ్ ను ఆయన అనుచరులతో కలిసి పరామర్శించారు, అనంతరం మాట్లాడారు,

బెల్లంపల్లి నియోజకవర్గంలో అభివృద్ధి గురించి సోషల్ మీడియాలో ప్రశ్నించినందుకు దాడులు చేయడం అనేది సిగ్గుమాలిన చర్యని, రానున్న ఎన్నికల్లో ఓడిపోతామనే భయంతోనే ఇలాంటి దాడులకు పాల్పడుతున్నారని, ఒక ప్రాంతీయ పార్టీలో ఉన్న మీరే ఇలా చేస్తే మా జాతీయ పార్టీలో ఉన్న కార్యకర్తలు ఎంతమంది ఉంటారో మీ విచక్షణకే వదిలేస్తున్నామని అన్నారు.

అంతరం మంచిర్యాల డిసిపి కార్యాలయానికి వెళ్లి నిందితులను వెంటనే కఠినంగా శిక్షించాలని డిసిపి కి ఫిర్యాదు చేసినట్టు వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో గొల్లపల్లి ఎంపిటిసి బొమ్మెన హరీష్ గౌడ్, మంచిర్యాల జిల్లా ఉపాధ్యక్షులు జీవీ ఆనంద్ కృష్ణ, రాజనిష్ జైన్, బెల్లంపల్లి పట్టణ అధ్యక్షులు కోడి రమేష్, పట్టణ ప్రధాన కార్యదర్శి రాచర్ల సంతోష్ కుమార్, రేవెల్లి విజయ్, తదితర మండల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Next Story
Share it