Sneha TV
తెలంగాణ

రైతుల సక్షేమమే తమ ప్రభుత్వ ధ్యేయం రైతు ఏలాంటి ఆపద వచ్చిన అదుబాటులో ఉంటా తమది రైతు సంక్షేమ ప్రభుత్వం మంత్రి గంగుల కమలాకర్ స్పష్టీకరణ

రైతుల సక్షేమమే తమ ప్రభుత్వ ధ్యేయం    రైతు ఏలాంటి ఆపద వచ్చిన అదుబాటులో ఉంటా    తమది రైతు సంక్షేమ ప్రభుత్వం    మంత్రి గంగుల కమలాకర్ స్పష్టీకరణ
X

కరీంనగర్ ఆగస్టు 5 ప్రజాపాలన ప్రతినిధి:

తెలంగాణ రైతాంగం పండించిన వరి ధాన్యాన్ని కేంద్రం తీసుకోకుండా ఇబ్బందులకు గురిచేస్తోందని,

ధాన్యం కొనుగోలు పై మరోసారి కేంద్ర ప్రభుత్వంతో పోరాటానికి సిద్ధమవ్వాలని రాష్ట్ర మంత్రి గంగుల‌ కమలాకర్ పిలుపునిచ్చారు.

శుక్రవారం కరీంనగర్ వ్యవసాయ మార్కెచ్ కమిటి ఛైర్మన్ ప్రమాణ స్వీకారోత్సవానికి మంత్రి ముఖ్య అతిథిగా హజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ

కరీంనగర్ నియోజకవర్గ ప్రజల ఆశీర్వాదంతోనే తాను మంత్రిని అయ్యానని తనపై నమ్మకంతో మూడు సార్లు గెలిపించిన ప్రజల రుణం తీర్చుకుంటానని హామి ఇచ్చారు. వెనకబడిన కులాలకు చెందిన రెండు శాఖల మంత్రిగా అవకాశం ఇచ్చిన సీఎం కేసీఆర్ కు హంగుల కృతజ్ఞతలు తెలియ చేశారు.

రైతు కుటుంబం నుంచి కరీంనగర్ ప్రజలు నాకు హ్యాట్రిక్ విజయాలను కట్టబెట్టారని,

నన్ను నమ్మి గెలిపించిన ప్రజల సమస్యల పరిష్కారం కోసం... ఈ ప్రాంత అభివృద్ధి కోసం భయంతో భక్తి తో శక్తి వంచన లేకుండా కృషి చేస్తానని భరోసా ఇచ్చారు.

కరీంనగర్ నియోజకవర్గ అభివృఉంటానన్నారు.సీఎం కేసీఆర్ లేవు అనకుండా కోట్లాది రూపాయల నిధులు విడుదల చేస్తున్నారన్నారు.

సమైక్య పాలనలో సాగునీరు లేక ఇబ్బందులు పడ్డ పరిస్థితుల ను కళ్ళారా చూసి చలించి పోయామని ఇప్పుడాపరిస్థితి లేదన్నారు.

పక్కనే గోదారమ్మ ప్రవహిస్తున్న చుక్కానీరు రాక సాగునీటి కోసం గ్రామాలకు గ్రామాలు కొట్లాడుకున్న రోజులు

సాగు చేసేందుకు వర్షం చుక్క కోసం రైతన్నలు ఆకాశం వైపు రోజులు పోయాయన్నారు.

స్వయం పాలనలో వేలాదికోట్ల నిధులు తీసుకొచ్చి ఈ ప్రాంత అభివృద్ధికి కృషి చేస్తున్నామన్నారు.

కాలేశ్వరం జలాలను తీసుకొచ్చి ఉనికిని కోల్పోయిన చెరువులను బతికించామని,

కాలేశ్వరం జలాలు వచ్చిన తర్వాత గుంట భూమిని విడిచిపెట్టకుండా భూమికి బరువయ్యే పంటను పండిస్తున్నామన్నారు.

బిజెపి కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో సాగు తాగు నీరు కరెంటు లేక ఇబ్బందులు పడుతున్న పరిస్థితులు ఇప్పటికీ ఉన్నాయని,

తెలంగాణ ప్రజల ధైర్యంతోనే ప్రభుత్వం ముందుకు సాగుతోందన్నారు.

తెలంగాణ రైతాంగం ధాన్యాన్ని పండిస్తే ఆ ధాన్యాన్ని కొనుగోలు చేసే బాధ్యత కేంద్రానిదే అయినప్పటికి ఖాధరు తేయడం లేదన్నారు.

బీజేపీ పార్టీ

అధికారం కోసం మతాల మధ్య ఘర్షణలు పెట్టిన ఘనత కాంగ్రెస్... బిజెపి పార్టీలదేనని ఆయన మండి పడ్డారు.

తెలంగాణలో 60 శాతం మంది ప్రజలు కేసీఆర్ ప్రభుత్వం కావాలని కోరుకుంటున్నారని,పచ్చగా... సుస్థిరంగా ఉన్న తెలంగాణపై కాంగ్రెస్ బిజెపిలు విషం చిమ్ముతున్నాయని ఆయన ఆరోపించారు.

ఏపీకి సాగునీరు కావాలని తెలంగాణ ప్రభుత్వం నిర్మించిన కాలేశ్వరం ప్రాజెక్టును కూడా కూల్చేందుకు కుట్రలు పన్నుతున్నారన్నారు.

పోరాడి సాధించుకున్న తెలంగాణను కాపాడే దమ్ము కేవలం కేసీఆర్ కు మాత్రమే ఉందనన్నారు.

షర్మిల కేఏ పాలు తెలంగాణకు ఎందుకు వస్తున్నారో వారికే తెలియాలన్నారు.

కొంత మంది ఇతర పార్టీ నేతలు తెలంగాణలో పని గట్టు కుని పర్యటిస్తున్నారని ఏం సాధించటానికో ఆత్మవిమర్శ చేసుకోవాలన్నారు.

ఢిల్లీ పాలన కావాలా మన ఇంటి పాలన కావాలో తెలంగాణ ప్రజలు తెల్చుకోవాలని కోరారు.

తెలంగాణలోనే కరీంనగర్ ను తల తలలాడే నియోజకవర్గంగా తీర్చిదిద్దుతానని మంత్రి హామి ఇచ్చారు.

త్వరలోనే గ్రామాల బాట పట్టి గ్రామాల్లో నెలకొన్న సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానన్నారు.

నూతన పాలకవర్గం రైతులకు అండగా ఉండాలిని,వారికి దెబ్బ తాకితే ఆ నొప్పి తమదిగా భావించి ముందుకు సాగాలన్నారు.

పదవి కోసం కాకుండా... పార్టీ కోసం జెండా పట్టుకున్న వారికే పదవులు లభిస్తాయని,పార్టీ కోసం కార్యకర్తలు సలక్తి వంచనా లేకుండా కృషి చేయాలన్నారు.

కరీంనగర్ నియోజకవర్గ ప్రజలకు మంత్రిగా కాకుండా ఒక కార్యకర్తగా వారి గుండెల్లో ఉంటానని,అర్ధరాత్రి ఫోన్ చేసిన స్పందిస్తానని గంగుల భరోసా ఇచ్చారు. అనుక్షణం అందుబాటులో ఉంటానన్నార

Next Story
Share it