Sneha TV
తెలంగాణ

అధికారుల పేర్లు వ్రాసి ఆత్మహత్య చేసుకుంటా. -స్థలం ఇచ్చిన దాత. బాధితుడు ఆకుల నరసింహరావు

అధికారుల పేర్లు వ్రాసి ఆత్మహత్య చేసుకుంటా. -స్థలం ఇచ్చిన దాత. బాధితుడు ఆకుల నరసింహరావు
X

పాలేరు ఆగస్ట్ 5 ప్రజాపాలన ప్రతినిధి

విద్యుత్ సబ్ స్టేషన్ కు తాళాలు వేసి ధర్నా, పురుగుల మందు డబ్బా తో ఆత్మహత్య యత్నం

గేట్ తాళాలు తీస్తే... అధికారుల పేర్లు వ్రాసి ఆత్మహత్య చేసుకుంటా. -స్థలం ఇచ్చిన దాత. బాధితుడు ఆకుల నరసింహరావు.

ఉద్యోగం ఇస్తారా... లేక ఆత్మహత్య చేసుకోమంటారా అని..ఓ బాధితుడు విద్యుత్ సబ్ స్టేషన్ వద్ద పురుగుల మందు తో ఆత్మహత్య యత్నం కు పాల్పడాడు. సహచరులు చూసి ఆపటంతో ప్రమాదం తప్పింది. సిబ్బందిని విధుల్లోకి రాకుండా ప్రధాన గేట్ కు కార్యాలయం కు తాళాలు వేసి నిరసన చేపట్టారు. వివరాలు ఇలా ఉన్నాయి. నేలకొండపల్లి మండలంలోని చెరువుమాదారం గ్రామంలో 33 బై 11 కెవి. విద్యుత్ సబ్ స్టేషన్ నిర్మాణం కోసం ఓ సన్నకారు రైతు నుంచి ప్రభుత్వం అర ఎకరం స్థలం ను 2014 లో తీసుకున్నారు. ఆ సయమంలో స్థల దాత కుటుంబానికి చెందిన ఆకుల

నరసింహారావు కు ఉద్యోగం ఇస్తామని అప్పటి మంత్రి అధికారులు,

నాయకులు హమీ ఇచ్చారు. ఈ నేపథ్యంలో దాదాపు నాలుగేళ్ల పాటు సబ్ స్టేషన్ లో వెట్టిచాకిరి చేశాడు. కానీ ఒక్క పైసా వేతనం ఇవ్వలేదు. ఉద్యోగం ఇవ్వటం లేదు. దీంతో అధికారులు, ప్రజాప్రతినిధులు చుట్టూ తిరిగి విసుగు చెందాడు. తనకు ఉద్యోగం ఇవ్వటం లో అధికారులు నిర్లక్ష్యం పురుగుల మందు తాగేందుకు ప్రయత్నించటంతో అక్కడే ఉన్న గ్రామస్తులు

చేస్తున్నారని శుక్రవారం సబ్ స్టేషన్ వద్ద నిరసన చేపట్టారు. తొలుత

ప్రయత్నం ను అడ్డుకున్నారు. ఇక చేసేది లేదని ప్రధాన గేట్ కు .

కార్యాలయం కు తాళాలు వేశారు. దీని వలన సిబ్బంది లోపలికి రాకుండా

ఇబ్బందులు పడ్డారు. లోపల ఉన్న వారు బయటకు వెళ్లేందుకు తీవ్ర ఇక్కట్లు

పడ్డారు. ఈ సందర్భంగా బాధితుడు నరసింహారావు

మాట్లాడుతూ..విలువైన స్థలం ను ఇచ్చే సమయంలో అధికారులు,

ప్రజాప్రతినిధులు ఉద్యోగం ఇస్తామని చెప్పి మోసం చేశారని ఆరోపించారు.

విద్యుత్ శాఖ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని వాపోయారు.

తనకు ఉద్యోగం వచ్చే వరకు నిరసన కొనసాగిస్తానని ఆవేదన వ్యక్తం

చేశారు. గేట్ తాళాలు తీస్తే అధికారులు పేర్లు వ్రాసి ఆత్మహత్య

చేసుకుంటానని హెచ్చరించారు.

Next Story
Share it