Sneha TV
తెలంగాణ

కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నిరంకుశ ధోరణికి వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ ధర్నా

కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నిరంకుశ ధోరణికి వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ ధర్నా
X

కోరుట్ల, ఆగస్టు 05 (ప్రజాపాలన ప్రతినిధి):

అడ్డు అదుపు లేకుండా పెరుగుతున్న ధరలకు నిరసనగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నిరంకుశ ధోరణికి వ్యతిరేకంగా ఏఐసీసీ మరియు టీపీసీసీ ఇచ్చిన పిలుపుమేరకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో చేపడుతున్న ధర్నాలో భాగంగా కోరుట్ల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ జువ్వాడి నర్సింగరావు ఆదేశానుసారం కోరుట్ల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకులు ధర్నా చేశారు. ఇందులో భాగంగా కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకుడు జువ్వాడి కృష్ణారావు మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా విధించిన జిఎస్టి మూలంగా నేడు నెలకు సుమారు రెండు లక్షల కోట్ల రూపాయలు దేశ ఖజానాకు అదనంగా వచ్చి చేరినప్పటికీ యువతకు ఉద్యోగాలు కల్పించడంలో ఈ ప్రభుత్వాలు చేతులెత్తేశాయని కనీసం రక్షణ రంగంలో ఉద్యోగాలు ఇవ్వమంటే అగ్ని వీరుల పేరుతో నాలుగు సంవత్సరాలు పనిచేసి సరిపెట్టుకోమంటున్నారని దేశ రక్షణ రంగానికి బడ్జెట్ లో నిధులు పెంచడానికి పైసలు లేవు, దేశానికి వెన్నుముక లాంటి రైతులకు మద్దతు ధర ఇవ్వమంటే పైసలు లేవు, యువతకు ఉద్యోగాలు కల్పించమంటే పైసలు లేవు మరి పన్నుల రూపంలో వసూలు అవుతున్న లక్షల కోట్ల రూపాయలు ఎక్కడికి పోతున్నాయి కేవలం గుజరాత్ రాష్ట్రానికి చెందిన ఇద్దరు వ్యాపారులు మాత్రమే ప్రపంచ కుబేరుల స్థానంలో నెంబర్ వన్, నెంబర్ టు స్థానానికి పోటీ పడడంలో ఈ మోడీ ప్రభుత్వం సహకరిస్తున్నది తప్ప దేశ ప్రజల కనీస అవసరాలు తీర్చడంలో ఏమాత్రం శ్రద్ధ చూపడం లేదని అన్నాడు. ఇప్పటికే పలుమార్లు పెంచిన పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరల మూలంగా కూరగాయల నుండి మొదలుకొని ఉప్పు, పప్పు, నూనెల ధరలన్నీ కొండెక్కి కూసున్నయని అది చాలదు అన్నట్టు పాలు, పెరుగు, గోధుమపిండి, ఉప్పు, పప్పులు చివరకు చిన్న పిల్లలు తినే మ్యాగీ ప్యాకెట్లపై సైతం జి ఎస్ టి విధించి కన్నతల్లుల, ఆడపడుచుల ఉసురు పోసుకుంటున్నారని ఇది ముమ్మాటికి రాక్షస పాలన అని దయ్యపట్టాడు. కొత్త బస్ స్టాండ్ వద్ద అంబేడ్కర్ విగ్రహం ముందు శాంతి యుతంగా ప్రజా స్వామ్య పద్దతిలో ధర్నా రాస్తారోకో నిర్వహిస్తున్న కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు జువ్వాడి కృష్ణా రావు పై పోలీసుల తోపులాటలో జువ్వాడి కృష్ణా రావు సొమ్మసిల్లి పడిపోయారు. వెంటనే కృష్ణా రావుని కాంగ్రెస్ శ్రేణులు హాస్పిటల్ కు తరలించారు.పోలీసుల తీరును అక్కడ సంఘటన స్థలంలో ఉన్న మహిళలు, ప్రజలు తీవ్రంగా తప్పు బట్టరని కాంగ్రెస్ నాయకులు ఆరోపించారు.ఈ నిరసన కార్యక్రమంలో కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు జువ్వాడి కృష్ణారావు, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు తిరుమల గంగాధర్, పట్టణ ఉపాధ్యక్షులు ఎం ఎ నయీం, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు పేరుమండ్ల సత్యనారాయణ గౌడ్,

కోరుట్ల నియోజకవర్గం యూత్ కాంగ్రెస్ అద్యక్షులు ఏలేటి మహిపాల్ రెడ్డి,మెట్ పల్లి మండల కాంగ్రెస్ అద్యక్షులు తిప్పి రెడ్డి అంజి రెడ్డి,మైనారిటీ రాష్ట్ర కన్వీనర్ హఫీజ్ , కిసాన్ కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు అమరేందర్, పట్టణ ప్రధాన కార్యదర్శి తుపాకుల భాజన్న, కిసాన్ సెల్ జిల్లా ఉపాధ్యక్షులు శసిందర్, యూత్ కాంగ్రెస్ నియోజకవర్గం ప్రధాన కార్యదర్శులు సోమ నాగార్జున రెడ్డి, మ్యాదరి లక్ష్మణ్, అందే మారుతి బాపూజీ, శైదు గంగాధర్,మండల ఉపాధ్యక్షులు నబీ, పట్టణ యూత్ కాంగ్రెస్ అద్యక్షులు రిజ్వాన్ పాషా, పట్టణ కార్యదర్శులు మ్యకల నర్సయ్య, దండవెని వెంకట్, ఎస్సీ సెల్ అద్యక్షులు పసుల కృష్ణా ప్రసాద్,పురాణం నాగరాజు, జీ గంగాధర్,కోరుట్ల మండలం యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు పన్నాల అంజిరెడ్డి,కాంగ్రెస్ నాయకులు ఎన్ భూమయ్య, జబ్బార్, చిలివెరి విజయ్ కుమార్, నజ్జు, షకీల్ , ముజిబిత్, అతిక్,అమాన్,మణికంఠ,జమీల్, నవీన్ వేల్పుల,గడ్డం అనిల్ రెడ్డి,జక్కుల శ్రీకాంత్,జంబుక అజిత్ కోరుట్ల నియోజకవర్గం కాంగ్రెస్ సోషల్ మీడియా ఇంఛార్జి ముహమ్మద్ నసీర్ మరియు తదితరులు పాల్గొన్నారు.

Next Story
Share it