బస్సు సౌకర్యం డిపో మేనేజర్ కు వినతి

శేరిలింగంపల్లి -ప్రజా పాలన/ ఆగస్ట్ 4 :మసీదు బండ అపర్ణా సెరీనా సీనియర్ సిటిజన్స్ వారి కోరిక మేరకు గచ్చిబౌలి బస్సు డిపో మేనేజర్ ని కలిసి శుక్రవారం వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా రవికుమార్ యాదవ్ మాట్లాడుతూ అపర్ణ సెరీనా చుట్టుపక్కల అపార్ట్మెంట్ వాసులు కొంతమంది సీనియర్ సిటిజన్స్ వచ్చి కలిసి బస్సు సౌకర్యం సరిగా లేదని ఎక్కడికైనా వెళ్లాలంటే బాగా ఇబ్బందికరంగా ఉందని ఉదయం సాయంత్రం వేళల్లో బస్సు సౌకర్యం కల్పించాలని స్థానికులు కోరినట్లు తెలిపారు. వారి అభ్యర్థన మేరకు హెచ్ సి యు డిపో మేనేజర్ ని కలిసి ప్రతిరోజు డిపో నుండి ఉదయం 8 గంటల నుండి 10 గంటల మధ్య రాయదుర్గం, మియాపూర్ మెట్రో స్టేషన్ వరకు బయలుదేరే బస్సులను, సాయంత్రం 5 గంటల నుంచి 7 గంటల సమయంలో మియాపూర్ మెట్రో స్టేషన్ నుండి వయా లింగంపల్లి, రాయదుర్గం నుండి లింగంపల్లికి వచ్చే బస్సులను అపర్ణ సెరీనా మీదుగా బస్సు సౌకర్యం కల్పించవలసిందిగా మేనేజర్ ను కోరినట్లు తెలిపారు. డిపో మేనేజర్ సానుకూలంగా స్పందించి వీలైనంత త్వరలో బస్సు సౌకర్యం కల్పిస్తామని హామీ ఇచ్చారని తెలిపారు. ఈ కార్యక్రమంలో కంచర్ల ఎల్లేష్ , వినోద్ యాదవ్, బాబు ముదిరాజ్, రామకృష్ణారెడ్డి, గోపి తదితరులు పాల్గొన్నారు.
రక్ష బంధన్ సందర్భంగా అక్క చెల్లెళ్లకు శుభాకాంక్షలు తెలియజేశారు
13 Aug 2022 3:28 AM GMTబ్యాంకు డిజిటల్ సేవలను సద్వినియోగం చేసుకోవాలి
13 Aug 2022 3:27 AM GMTఫ్రీడమ్ ర్యాలీలో ప్రజలు స్వచ్ఛందంగా పాల్గొని విజయవంతం చేయాలి ** ...
13 Aug 2022 3:25 AM GMTశాంతి నిలయంలో రాఖీ వేడుకలు బహుజన సాధికారత సమితి వ్యవస్థాపక...
13 Aug 2022 3:24 AM GMTకుటుంబ బాంధవ్యాలకు బలమైన పునాది రక్షాబంధనం
13 Aug 2022 3:22 AM GMT