Sneha TV
తెలంగాణ

రమణమ్మను సన్మానించిన లయన్స్ క్లబ్ ప్రతినిధులు..

రమణమ్మను సన్మానించిన లయన్స్ క్లబ్ ప్రతినిధులు..
X

తల్లాడ, ఆగస్టు 5 (ప్రజాపాలన న్యూస్):

తల్లాడ మట్టమ్మ హోటల్ అధినేత సరికొండ రమణమ్మను లయన్స్ క్లబ్ తల్లాడ మండల అధ్యక్షులు దగ్గుల రాజశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో లయన్స్ ప్రతినిధులు శుక్రవారం సన్మానించారు. గత నెలలో భారీ వర్షాలు రావడంతో ముంపు ప్రాంతాల ప్రజలకు నిత్యవసర సరుకులు, ఆర్థిక సాయం అందించినందుకుగాను లయన్స్ క్లబ్ ప్రతినిధులు ఆమెను శాలువాలు, పూలమాలతో సన్మానించి సత్కరించారు. అనంతరం వారు మాట్లాడుతూ రమణమ్మ అనేక సేవా కార్యక్రమాలు చేపడుతూ ప్రజల మన్నలను పొందడం సంతోషంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో లైన్స్ క్లబ్ ప్రతినిధులు మిట్టపల్లి నరసింహారావు, దారా శ్రీనివాసరావు, పులబాల వెంకటేశ్వర్లు, గుంటుపల్లి వెంకటేశ్వరరావు, అనుమోలు సర్వేశ్వరరావు, సరికొండ అప్పలరాజు, లయన్స్ క్లబ్ సభ్యులు పాల్గొన్నారు.

Next Story
Share it