Sneha TV
తెలంగాణ

బోనాల రాజేశం మరణం బాధాకరం ఓసి సామాజిక సంఘాల సమాఖ్య జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు

కరీంనగర్ ఆగస్టు 4 (ప్రజాపాలన) :

కరీంనగర్ లో నివాసం ఉంటున్న కరీంనగర్ మండల కమాన్ పూర్ గ్రామ మాజీ సర్పంచ్ కరీంనగర్ జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ అప్పటి సీనియర్ టీడీపీ జిల్లా నాయకుడు ప్రస్తుత టీ ఆర్ ఎస్ పార్టీ నాయకులు బోనాల రాజేశం కొద్దిసేపటి క్రితం ఆకస్మికంగా మృతి చెందడం పట్ల ఓసి సామాజిక సంఘాల సమాఖ్య జాతీయ అధ్యక్షుడు రైతు నేత పోలాడి రామారావు తీవ్ర విచారం వ్యక్తంచేశారు.

అన్ని వర్గాల ప్రజల తో పార్టీల నాయకుల ప్రేమాభి మానాలు పొందిన బోనాల రాజేశం మరణం బాధాకరం వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలుపుతూ రాజేశం మరణం తీరని లోటని పోలాడి రామారావు ఆవేదన వ్యక్తంచేశారు.

Next Story
Share it