Sneha TV
తెలంగాణ

రోడ్డుకు మరమ్మతు చేయాలి

రోడ్డుకు మరమ్మతు చేయాలి
X

జన్నారం, ఆగస్టు 04, ప్రజాపాలన: మంచిర్యాల జిల్లా జన్నారం మండలం చింతలపల్లి గ్రామం నుండి ఇప్పలపల్లి మీదుగా మండల కేంద్రానికి వేళ్లే రహదారి పూర్తిగా బురదమైంగా వున్నది, ఈ చింతలపల్లి గ్రామపంచాయతిలో ముడువేల లోపు ప్రజలు నివాసం ఉంటున్నారు, గ్రామంలో ప్రజలు రాకపోకలు జరుగుచున్నప్పుడు నడక దారి గ్రామ ప్రజలకు, వాహన దారులకు రోడ్డు మార్గం గుండా ప్రయాణం చేసే వారికి, ఈ రోడ్డు వలన ఇబ్బందులు ఎర్పాడుతున్నాయి. వర్షము పడినప్పుడు రోడ్డు బురదమైంగా అవుతుంది. ఈ సందర్భంగా మాట్లాడుతూ అధికారులు స్పందించి రోడ్డు మరమత్తులు చేసి వాహన దారుల రాకపోకలకు ఆటంకం లేకుండా చేయాలని, రోడ్డు మరమ్మతు గ్రామస్థులు కోరుతున్నారు. అ గ్రామానికి సిసి రోడ్డు వేయాలని అధికారులు స్పందించి రోడ్డు మరమ్మతు స్థానికులు అంటున్నారు. ఈ సందర్భంగా రోడ్డు మరమ్మతు చేయాని యెడల చింతలపల్లి బీజేపీ నాయకుల ఆద్వర్యంలో డిమాండు చేస్థామని హేచ్చారించారు. ఈ కార్యక్రమంలో మండల ఐటీ సెల్ కో- కన్వీనర్ బూర్రగడ్డ జగన్, బూరగడ్డ నరేష్, ముదెళ్ల శెంకర్, గట్టు గంగమల్లు, గూడ గంగాధర్, పంజాల సురేష్, బత్థిని నాగన్న, కాటుకం సత్తన్న తదితరులు పాల్గొన్నారు.

Next Story
Share it