Sneha TV
తెలంగాణ

ముర్రు పాలు బిడ్డకు రక్షణ కవచం. ఐసిడిఎస్ సుపర్ వైజర్ అర్ పద్మ

ముర్రు పాలు బిడ్డకు రక్షణ కవచం.  ఐసిడిఎస్ సుపర్ వైజర్ అర్ పద్మ
X

జన్నారం, ఆగస్టు 04, ప్రజాపాలన:

ముర్రు పాలు బిడ్డకు రక్షణ కవచం అని

ఐసిడిఎస్ సుపర్ వైజర్ అర్ పద్మ

అన్నారు. గురువారం మంచిర్యాల జిల్లా జన్నారం మండలం తిమ్మాపూర్ గ్రామంలో తల్లిపాలు వారోత్సవాలు నిర్వహించారు. ఈ సందర్భంగా అమె మాట్లాడుతూ బిడ్డ పుట్టిన మెుదటి అరగంట లోపు పాలను శిశువు కు పట్టించాలని తెలిపారు. బిడ్డకు సరిపడా పాలు రావడం లేదని తల్లులు అనుకోవడం అపోహ మాత్రమేనాని తెలిపారు. బిడ్డ పుట్టగానే పాలు మూడు నాలుగు రోజుల వరకు పడవని తేనే నాకించడం పంచదార నీళ్లు ఇవ్వడం గ్లూకోజ్ నీళ్లు ఇవ్వడం చేయకూడదని హెచ్చరించారు. తల్లి పాలు కంటే శ్రేష్ఠమైన అవి లేవని ఈ విషయము తల్లులు గ్రహించాలన్నారు. తల్లి బిడ్డల మద్య అనుబంధాన్ని పెంచేది తల్లిపాలు ఒకటేనాని, బిడ్డ పుట్టిన అరు నెలల వరకు తల్లిపాలు తప్పనిసరిగా పట్టించాలని తెలిపారు. ఈ సందర్భంగా గత సోమవారం నుంచి ఆగస్టు 7 వరకు ప్రపంచ వ్యాప్తంగా ప్రారంభమైన తల్లిపాల వారోత్సవాలు ప్రాముఖ్యతను ఘనంగా నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యాక్రమంలో తిమ్మాపూర్ సర్పంచ్ జాడి గంగాధర్, ఎంపిటిసి దర్శనాల వెంకటస్వామి, స్థానిక గ్రామ కార్యదర్శి లావణ్య, అంగన్వాడీ టీచర్లు జాడి సంజీవరాణి, గంజాయిల జమున,ఆయాలు జునుగురి పద్మ , ఏసుమణి ,ఎఎన్ఎమ్ మాధవి, అశా రజిత, తల్లులు, తదితరులు పాల్గొన్నారు.

Next Story
Share it