ఎమ్మెల్యే సహకారంతోటి మరింత మునగనూర్ గ్రామాన్ని అభివృద్ధి చేస్తాం

ఇబ్రహీంపట్నం ఆగష్టు తేదీ 4 ప్రజాపాలన ప్రతినిధి. ఇబ్రహీంపట్నం తుర్కయంజాల్ మున్సిపల్ పరిధిలో మునగనూర్ గ్రామం లో అభివృద్ధి చెందే విధంగా ఎమ్మెల్యే సహకారంతో అభివృద్ధి పనులు ముమ్మారంగా సాగుతున్నాయని కౌన్సిలర్ వేముల స్వాతి అమరేందర్ రెడ్డి మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ అనేక పథకాలు ప్రజలకు అందించి రాష్ట్రాన్ని ఒక ఆదర్శవంతం చేయడమే లక్ష్యాన్ని పెట్టుకుని అనేక పథకాల తెచ్చిపెట్టి దేశంలో కనివిని ఎరుగని రీతిలో దేశంలోనే మన రాష్ట్రం నెంబర్ వన్ గా గుర్తించే విధంగా ముఖ్యమంత్రి చేస్తున్నారని ఆమె తెలిపారు. దళితులకు దళిత బంధు రైతులకు రైతుబంధు రైతు బీమా మహిళలకు కల్యాణ లక్ష్మి షాదీ ముబారక్ లాంటి ఎన్నో పథకాలు తెచ్చిపెట్టి ప్రజలకు అనుగుణంగా ప్రజలకు సౌకర్యాలు కల్పిస్తూ విధంగా చేస్తుందని ఆమె తెలిపారు. తెలంగాణలో మళ్లీ టిఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తుందని కౌన్సిలర్ అన్నారు.