సేవాలాల్ సేన రాష్ట్ర అధికారి ప్రతినిధి జటోవత్ రవి నాయక్

ఆగస్టు 9న ఛలో ప్రగతి భవన్ వికారాబాద్ బ్యూరో 04 ఆగస్టు ప్రజా పాలన : ఆగస్టు 9న ప్రపంచ ఆదివాసీ గిరిజన దినోత్సవాన్ని పురస్కరించుకుని చలో ప్రగతి భవన్ ఉద్యమాన్ని విజవంతం చేద్దామని సేవాలాల్ సేన రాష్ట్ర అధికారి ప్రతినిధి జటోవత్ రవి నాయక్ పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వానికి గిరిజనుల సమస్యలపై మాట్లాడే, పరిష్కరించే సమయం లేనందున వారి వద్దకే రాష్ట్రంలో ఉన్న ఆదివాసి గిరిజన రైతులు, నాయకులు, మేధావులతో కలిసి వెళ్తామన్నారు. భూమి కోసం, భుక్తి కోసం, బానిస సంకెళ్ల విముక్తి కోసం ఆనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో తగిన న్యాయం జరగలేదని విమర్శించారు. ప్రత్యేక తెలంగాణ వస్తే మా బ్రతుకులు బాగుపడతాయని సాధించుకున్న తెలంగాణ లో పోడు వ్యవసాయం, గిరిజన ఆదివాసీల మీద రాష్ట్ర ప్రభుత్వం ఉక్కు పాదం మోపుతున్నదని స్పందించారు. గిరిజనులకు ఏ ప్రభుత్వం కూడా సెంటు భూమిని కూడా కొనుగోలు చేసి ఇచ్చిన దాఖలా లేవని దెప్పి పొడిచారు. 2006 అటవీ హక్కుల చట్టం' ప్రకారం.. గిరిజనులు సాగు చేసుకుంటున్న పోడు భూములకు హక్కుల పత్రాలు ఇవ్వాల్సింది పోయి.. హరితహారం పేరిట మొక్కలు నాటాలని దౌర్జన్యం చేస్తోంది. ఉమ్మడి ఆదిలాబాద్ నిర్మల్ జిల్లాల్లో పోడు గిరిజన రైతులపై , ఫారెస్ట్ సిబ్బంది అనేక సార్లు ఘర్షణకు దిగుతున్నారు. నిరుపేద ఆదివాసీలను, గిరిజనులను ఇష్టం వచ్చినట్లు కొట్టడం, ఆసుపత్రిపాలు చేయడం, పసి పిల్లల తల్లులని కూడా చూడకుండా కేసులు పెట్టి జైలుపాలు చేయడం. పరిపాటిగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. మాపై దౌర్జన్యం ప్రదర్శిస్తూ.. మానవ హక్కుల ఉల్లంఘనకు పాల్పడుతున్నారు.
గిరిజనుల ఆందోళనలను, హక్కుల పోరాటాలను అటవీ అధికారుల మీద దాడులుగా, భూ ఆక్రమణలుగా చిత్రీకరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
పోడు భూముల మాటున అధికారుల అండదండలతో అడవిని నరికి రియల్ వ్యాపారం చేస్తున్న కబ్జాదారులు అడవి ప్రాంతంలో బహుళ అంతస్తులు మరియు పరిశ్రమల నిర్మాణంలో ద్వాంసమైనా అటవి భూమి ఎంతో శ్వేత పత్రాన్ని రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయాలనీ డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు అధ్యక్షుడు పరశురాం జాదవ్, సేన రాష్ట్ర ఉద్యోగ ఉపాధ్యక్షుడు హరినాథ్ పవార్ పరగి తాలూకా ప్రధాన కార్యదర్శి రాములు చవాన్, జిల్లా ప్రధాన కార్యదర్శి , రాష్ట్ర సర్పంచ్ పొరం అధ్యక్షుడు జటోవత్ శంకర్ నాయక్, కౌన్సిలర్ ఆర్ చందర్ నాయక్, గోపాల్ చవాన్, విద్యార్థి జిల్లా అధ్యక్షుడు విశ్వనాథ్ తదితరులు పాల్గొన్నారు.
హత్యకేసులలో నిందితునికి జీవితఖైదు
18 March 2021 11:03 AM GMTఎర్రుపాలెం మండలం అయ్యవారిగూడెంలో రెండు రోజుల క్రితం మిస్సైన నవ వధువు...
5 Feb 2021 10:04 AM GMTహత్యకు దారితీసిన అక్రమ సంబంధం
23 Jun 2020 12:00 AM GMTబైక్ ను ఢీకొన్న జీపు.. వ్యక్తి మృతి
17 April 2019 12:00 AM GMTక్షణికావేశంలో స్నేహితున్ని హతమార్చిన యువకుడు
1 Jan 2019 12:00 AM GMT
రక్ష బంధన్ సందర్భంగా అక్క చెల్లెళ్లకు శుభాకాంక్షలు తెలియజేశారు
13 Aug 2022 3:28 AM GMTబ్యాంకు డిజిటల్ సేవలను సద్వినియోగం చేసుకోవాలి
13 Aug 2022 3:27 AM GMTఫ్రీడమ్ ర్యాలీలో ప్రజలు స్వచ్ఛందంగా పాల్గొని విజయవంతం చేయాలి ** ...
13 Aug 2022 3:25 AM GMTశాంతి నిలయంలో రాఖీ వేడుకలు బహుజన సాధికారత సమితి వ్యవస్థాపక...
13 Aug 2022 3:24 AM GMTకుటుంబ బాంధవ్యాలకు బలమైన పునాది రక్షాబంధనం
13 Aug 2022 3:22 AM GMT