Sneha TV
తెలంగాణ

అర్చకుల కుటుంబ సభ్యులకు నగదు అందజేత..

అర్చకుల కుటుంబ సభ్యులకు నగదు అందజేత..
X

తల్లాడ, ఆగస్టు 4 (ప్రజా పాలన న్యూస్): తల్లాడ మండలంలోని కేశవాపురం గ్రామంలో ఉన్న శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయ అర్చకులు అమరవాది వెంకట వరదరాజన్, మధుమతి కుమార్తె వెంకట కృష్ణ ప్రియాంక ఉన్నత చదువుల నిమిత్తం గ్రామానికి చెందిన చావా నరసింహారావు, జయమ్మ కుమారుడు ఎన్ఆర్ఐ చావా అమర్ చంద్ ,స్వాతి దంపతులు 10వేలుఆర్థిక సహాయంగా గురువారం అందించారు.ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ వనిగండ్ల అలేఖ్యఅశోక్ వారి కుటుంబ సభ్యులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. అనంతరం మాట్లాడుతూ ఆలయ అర్చకులు కుటుంబానికి గత మూడు సంవత్సరాల నుంచి సహాయం అందిస్తున్న నరసింహారావు కుటుంబ సభ్యులకు కేశవాపురం గ్రామ ప్రజల తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

Next Story
Share it