Sneha TV
తెలంగాణ

ప్రభుత్వ పాఠశాలలో వసతుల కల్పనకు కృషి కార్పొరేటర్ హరిశంకర్ రెడ్డి

ప్రభుత్వ పాఠశాలలో వసతుల కల్పనకు కృషి  కార్పొరేటర్ హరిశంకర్ రెడ్డి
X

మేడిపల్లి, జూన్23 (ప్రజాపాలన ప్రతినిధి)

పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఉన్నటువంటి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలు మరియు ప్రాథమిక పాఠశాలలో మేయర్ జక్క వెంకట్ రెడ్డి సహకారంతో వసతుల కల్పనకు కృషి చేస్తానని 25వ డివిజన్ కార్పొరేటర్ దొంతిరి హరిశంకర్ రెడ్డి పేర్కొన్నారు.

ఈ మేరకు మేయర్ జక్క వెంకట్ రెడ్డి ఆదేశానుసారంతో కార్పొరేటర్

హరిశంకర్ రెడ్డి మేడిపల్లి ప్రభుత్వ పాఠశాలలో ప్రధాన ఉపాధ్యాయులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ దొంతిరి హరిశంకర్ రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల ప్రవేశాలు పెరుగుతుండడంతో మేయర్ సూచనల మేరకు ప్రతి పాఠశాలకు కావలసిన వాలంటీర్స్ ను నియమింపచేస్తామని కార్పొరేటర్ హామీ ఇచ్చారు. అనంతరం మేడిపల్లి ప్రభుత్వ పాఠశాలలో అదనపు గదులు మరియు పాఠశాల చుట్టూ ప్రహరీ గోడ పనులను పరిశీలించారు.ఈ సమావేశంలో మేడిపల్లి ప్రధానోపాధ్యాయులు సత్యప్రసాద్, పీర్జాదిగూడ ప్రధానోపాధ్యాయులు సుశీల రెడ్డి, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

Next Story
Share it