Sneha TV
తెలంగాణ

విద్యార్థులకు నోట్ బుక్స్ ప్లేట్స్ ను పంపిణీ చేసిన కాంగ్రెస్ నేత రాగిడి లక్ష్మారెడ్డి

విద్యార్థులకు నోట్ బుక్స్ ప్లేట్స్ ను పంపిణీ చేసిన కాంగ్రెస్ నేత రాగిడి లక్ష్మారెడ్డి
X

మేడిపల్లి, జూన్ 23 (ప్రజాపాలన ప్రతినిధి)

ఉప్పల్ నియోజకవర్గం మల్లాపూర్ డివిజన్లోని జిల్లా పరిషత్ ప్రభుత్వ పాఠశాలలో మథుర చారిటబుల్ ట్రస్ట్ మరియు ఆర్ ఎల్ ఆర్ హెల్ప్ లైన్ ఆధ్వర్యంలో విద్యార్థులకు నోట్ బుక్స్ మరియు ప్లేట్స్ పంపిణీ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఉప్పల్ నియోజకవర్గ కాంగ్రెస్ సీనియర్ నాయకులు, మథుర చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ రాగిడి లక్ష్మారెడ్డి పాల్గొని పాఠశాలలోని 900 మంది విద్యార్థులకు ప్లేట్స్, నోట్ బుక్స్ ను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా రాగిడి లక్ష్మారెడ్డి మాట్లాడుతూ విద్యార్థులు క్రమశిక్షణతో విద్యను అభ్యసించి ఉన్నత శిఖరాలను అధిరోహించి పాఠశాలకు, తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురావాలని సూచించారు. పదవ తరగతి చదివిన పేద విద్యార్థులకు ఆపై చదువులు చదువుకోడానికి స్తోమత లేక ఇబ్బంది పడుతున్న వారికి మధుర చారిటబుల్ ట్రస్ట్ ద్వారా నేను చేయూతని అందిస్తానని తెలిపారు.

ఈ కార్యక్రమంలో పాల్గొన్న

మల్లాపూర్ డివిజన్ ప్రెసిడెంట్

నెల్లుట్ల శ్రీనివాస్ గౌడ్,

ఉప్పల్ యూత్ కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ సాయి గౌడ్, పీజీ సుదర్శన్, రాజుగౌడ్, మాత్తల రాజు గౌడ్, ఎం బాలరాజు, కె బాలరాజు, ప్రభాకర్ రెడ్డి, ఫసిఉద్దిన్, ఎండీ రిజ్వన్, టిల్లు ముదిరాజ్,కే సాయి, టిల్లు గౌడ్, విన్ను యాదవ్, గౌస్, శ్రీరాములు, రియాజ్ , పాఠశాల ఉాధ్యాయులు పాల్గొన్నారు.

Next Story
Share it