Sneha TV
తెలంగాణ

పెండింగ్ పనులను త్వరితగతిన పూర్తి చేయాలి ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డి

పెండింగ్ పనులను త్వరితగతిన పూర్తి చేయాలి   ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డి
X

మేడిపల్లి, జూన్ 23 (ప్రజాపాలన ప్రతినిధి)

రానున్న వర్షాకాలన్ని దృష్టిలో పెట్టుకొని

ఉప్పల్ సర్కిల్లోని అన్ని డివిజన్లలో పెండింగులో ఉన్న పనులను త్వరితగతిన పూర్తిచేయాలని ఉప్పల్ ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డి అధికారులకు సూచించారు. ఉప్పల్ మున్సిపల్ కార్యాలయంలో పట్టణ ప్రగతిలో సాధించిన అభివృద్ధి కార్యక్రమాలు, ప్రజల నుంచి వచ్చిన వినతులు చేయవలసిన అభివృద్ధి కార్యక్రమాలపై అన్ని శాఖల అధికారులతో కలిసి ఎమ్మెల్యే సుభాష్ రెడ్డి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సుభాష్ రెడ్డి

మాట్లాడుతూ సంబంధించిన ప్రతిపాదనలను త్వరతగతిన తయారు చేయాలని, రానున్న వర్షాకాలంను దృష్టిలో పెట్టుకొని నాల ,డ్రైనేజీ పనులను త్వరగా పూర్తి చేయాలని, వంగిపోయిన విద్యుత్ స్తంభాలను ఆధునీకరించాలని అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో ఎల్బినగర్ జోనల్ కమిషనర్ పంకజ, ఉప్పల్ డీసీ అరుణ కుమారి,ఈఈ నాగేందర్, జలమండలి మేనేజర్ జాన్ షరీఫ్, ఎలక్ట్రికల్ డిఈ. సాయి ప్రసాద్, టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ వెంకటరమణ , టిపిఎస్ మౌనిక ,ప్రాజెక్ట్ ఆఫీసర్ రమాదేవి డిఈ. నిఖిల్ రెడ్డి డిఈ. నాగమణి, ఎస్డబ్ల్యూడిఈ చందన, శానిటేషన్ సూపర్వైజర్ సుదర్శన్ అన్నిి శాఖలకు సంబంధించిన అధికారులు పాల్గొన్నారు.

Next Story
Share it