Sneha TV
తెలంగాణ

ఒలంపిక్ డే రన్ ను ప్రారంభించిన మేయర్ సునీల్ రావు కలెక్టర్ కర్ణన్, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఒలంపిక్ క్రీడలకు అధిక ప్రాధాన్యత ఇస్తుంది. ప్రభుత్వ ఆదేశాల ప్రకారం నగర వ్యాప్తంగా నగరపాలక సంస్థలో తెలంగాణ క్రీడా మైదానాల ను ఏర్పాటు చేస్తున్నాం. ఆరోగ్యవంతమైన కరీంనగర్ గా మార్చేందుకు నగరపాలక సంస్థ కృషి చేస్తుంది.

ఒలంపిక్ డే రన్ ను ప్రారంభించిన మేయర్ సునీల్ రావు కలెక్టర్ కర్ణన్,  తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఒలంపిక్ క్రీడలకు అధిక ప్రాధాన్యత ఇస్తుంది.    ప్రభుత్వ ఆదేశాల ప్రకారం నగర వ్యాప్తంగా నగరపాలక సంస్థలో తెలంగాణ క్రీడా మైదానాల ను ఏర్పాటు చేస్తున్నాం.    ఆరోగ్యవంతమైన కరీంనగర్ గా మార్చేందుకు నగరపాలక సంస్థ కృషి చేస్తుంది.
X

కరీంనగర్ జూన్ 23 ప్రజాతంత్ర ప్రతినిధి

:

నగరపాలక సంస్థ క్రీడలకు అధిక ప్రాధాన్యత ఇస్తూ ప్రోత్సహిస్తుందని నగర మేయర్ యాదగిరి సునీల్ రావు అన్నారు. కరీంనగర్లో ప్రపంచ ఒలంపిక్ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. గురువారం రోజు స్థానిక అంబేద్కర్ స్టేడియంలో జరిగిన ఒలంపిక్ డే రన్ కార్యక్రమంలో లో నగర మేయర్ యాదగిరి సునీల్ రావు, కలెక్టర్ ఆర్ వి కర్ణన్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. జిల్లా క్రీడా శాఖ మరియు క్రీడా సంఘాల ఆధ్వర్యంలో జరిగిన ఒలంపిక్ డే రన్నింగ్ ను కలెక్టర్ ఆర్ వి కర్ణన్ తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా మేయర్ సునీల్ రావు మాట్లాడుతూ... తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రభుత్వం ఒలంపిక్ క్రీడలకు అధిక ప్రాధాన్యత ఇస్తుందన్నారు. క్రీడలను ప్రోత్సహిస్తూ జాతీయ అంతర్జాతీయ ఒలింపిక్ క్రీడా పోటీల్లో పాల్గొనేందుకు కు నైపుణ్యత కలిగిన క్రీడాకారులను తయారు చేసేందుకు కృషి చేస్తుందన్నారు. ఇందులో భాగంగా గ్రామీణ క్రీడలను ప్రోత్సహించాలి విధంగా పల్లెలు పట్టణాల్లో తెలంగాణ క్రీడా మైదానాలు ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుందన్నారు. ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాల ప్రకారం నగరపాలక సంస్థ పరిధిలో ప్రతి డివిజన్ కు 3 నుండి 5 చొప్పున క్రీడా మైదానాలను ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఇప్పటికే పలు డివిజన్లలో క్రీడా మైదానాల ను ఏర్పాటు చేసి ప్రారంభించామన్నారు. కరీంనగర్ నగరాన్ని ఆరోగ్యవంతమైన నగరంగా తీర్చిదిద్దేందుకు నగరపాలక సంస్థ ప్రత్యేక చర్యలు తీసుకుంటుందన్నారు. ప్రజల ఆరోగ్యం దృష్ట్యా నగరంలో వాకింగ్ ట్రాక్ లు, ఓపెన్ జిమ్ లను ఏర్పాటు చేస్తున్నామన్నారు. నగర వ్యాప్తంగా ఇప్పటికే 35 లోనే ఏర్పాటు చేయడంతో పాటు పలుచోట్ల వాకింగ్ ట్రాక్ నిర్మాణాలను కూడా పూర్తి చేశామన్నారు. మరో 30 ఓపెన్ జిమ్ లకు టెండర్ల ప్రక్రియను కూడా పూర్తి చేసి ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. నగరపాలక సంస్థ ద్వారా స్మార్ట్ సిటీ ప్రాజెక్టులు అంబేద్కర్ స్టేడియం 16 కోట్ల రూపాయలతో అభివృద్ధి చేస్తున్నామన్నారు. డే నైట్ కూడా క్రీడలు ఆడే విధంగా స్టేడియంను ఆధునీకరించి చి కావలసిన వసతి సౌకర్యాలను కల్పిస్తున్నామని స్పష్టం చేశారు. స్మార్ట్ సిటీ లో లో స్పోర్ట్స్ కాంప్లెక్స్ నిర్మాణం పూర్తి చేసి ఇ ప్రారంభించేందుకు సిద్ధం చేశామన్నారు. వివిధ క్రీడలకు సంబంధించి క్రీడా కోట్లను అభివృద్ధి చేయడంతోపాటు ఇండోర్ స్టేడియం ను ఆధునీకరించి ఏమన్నారు. అంతేకాకుండా మంత్రి గంగుల కమలాకర్, ప్లానింగ్ బోర్డ్ వైస్ చైర్మన్ వినోద్ కుమార్ ల సహకారంతో త్వరలోనే మరో స్టేడియం నిర్మాణం చేసేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు స్పష్టం చేశారు. మంత్రి గంగుల కమలాకర్ ఆధ్వర్యంలో స్టేడియం కు సంబంధించి స్థల పరిశీలన కూడా చేశామన్నారు. నగరపాలక సంస్థ క్రీడలకు అధిక ప్రాధాన్యతనిస్తూ ప్రతి సంవత్సరం సమ్మర్ క్యాంప్ పేరిట 28 క్రీడాంశాల్లో బాల బాలికలకు శిక్షణ తరగతులు కూడా నిర్వహించినట్లు తెలిపారు. అంతే కాకుండా రాబోయే రోజుల్లో నగర పాలక సంస్థలో ప్రత్యేక క్రీడా విభాగం ఏర్పాటు చేసి వివిధ క్రీడల్లో ప్రతిభ చూపే క్రీడాకారులను తయారు చేసేందుకు కృషి చేస్తుందన్నారు. ఒలంపిక్ క్రీడలు శారీరక మానసిక ఎదుగుదలకు తోడ్పడుతాయని అన్నారు. చదువుతోపాటు క్రీడలకు కూడా ప్రత్యేక ప్రాధాన్యత ఉందని.. క్రీడలు భవిష్యత్ నిర్ణయించడంలో ముఖ్య పాత్ర పోషిస్తున్నారు అన్నారు. వచ్చే ఒలంపిక్ క్రీడలలో తెలంగాణ రాష్ట్రం తరుపున క్రీడాకారులు తయారై పథకాలను సాధించాలని ఆశాభావం వ్యక్తం చేశారు. కరీంనగర్ నుండి కూడా అంతర్జాతీయ ఒలంపిక్ పోటీల్లో పాల్గొనే విధంగా క్రీడాకారులు తయారు కావాలని పతకాలను సాధించి జిల్లాకు గుర్తింపు తీసుకురావాలని పిలుపునిచ్చారు. కోవిడ్ తో గత రెండు సంవత్సరాలు ఒలంపిక్ డే దినోత్సవాలకు దూరంగా ఉన్నా... క్రీడా శాఖ, క్రీడా సంఘాలు ఈ సంవత్సరం ఒలంపిక్ డే రన్ ఘనంగా నిర్వహించడం పట్ల ఆనందం వ్యక్తం చేశారు. ఒలంపిక్ డే రన్ నిర్వహించిన క్రీడా సంఘాలకు క్రీడాకారులకు ప్రత్యేక అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో లో క్రీడా సంఘాల నాయకులు చల్ల హరిశంకర్, నందిని మహిపాల్, డీ వై ఎస్ ఓ రాజా వీర్, వివిధ క్రీడల కోచ్ లు, క్రీడాకారులు పాల్గొన్నారు.

Next Story
Share it