ఘనంగా లాయర్ సుబ్రహ్మణ్యం సమత వివాహ వార్షికోత్సవ వేడుకలు
BY Sowjanya24 Jun 2022 4:12 AM GMT

X
Sowjanya24 Jun 2022 4:12 AM GMT
మధిర జూన్ 23 ప్రజా పాలన ప్రతినిధి మున్సిపాలిటీ పరిధిలో గురువారం నాడు: ప్రముఖ లాయర్ దేవరపల్లి సుబ్రహ్మణ్యం సమత గారి వివాహ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. గురువారం పట్టణంలోని మెయిన్ రోడ్డులో వేంచేసి ఉన్న వినాయకుడి గుడి వద్ద ప్రముఖ లాయర్ దేవరపల్లి సుబ్రహ్మణ్యం సమత గారి వివాహ వార్షికోత్సవం సందర్భంగా ఏర్పాటుచేసిన అన్నదానాన్ని మధిర బార్ అసోసియేషన్ అధ్యక్షులు బొజేడ్ల పుల్లారావు న్యాయవాది జింకల రమేష్ ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పేదల ఆకలి తీర్చేందుకు వివాహ వార్షికోత్సవం సందర్భంగా అన్నదానాలు ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు
Next Story