Sneha TV
తెలంగాణ

సమాచార హక్కు చట్టంను పట్టించుకోని మండల పరిషత్ అధికారులు - మండల పరిషత్ కార్యాలయంలో కొన్ని అంశాలపై సమాచార హక్కు చట్టం వేసిన ఓ వ్యక్తి - నేటికి రెండు నెలలు దాటినా సమాచారం ఇవ్వడంలో నిర్లక్ష్యం వహిస్తున్న అధికారులు - గతంలో కూడా పలుసార్లు ఇదే వైఖరిని ప్రదర్శించిన మండల పరిషత్ అధికారులు

X

బోనకల్, జూన్ 22 ప్రజా పాలన ప్రతినిధి: ప్రభుత్వ కార్యాలయాలు,సంస్థల నుంచి సమాచారాన్ని అడిగి తీసుకునే అధికారమే సమాచార హక్కు సామాన్యుడికి ఏ ఆఫీసుకు వెళ్ళినా పనిచేయించుకోవటం,తనకు కావలసిన సమాచారాన్ని రాబట్టటం కష్టతరమైన నేపథ్యంలో భారత ప్రభుత్వం 12 అక్టోబర్ 2005 తేదీన ఈ సమాచార హక్కు చట్టం భారతదేశమంతటా అమలులోకి వచ్చింది.దీనిని ఉపయోగించుకొని,ప్రభుత్వ పనులపై సమచారాన్ని పొందవచ్చు.వివరాల్లోకి వెళ్తే స్తానిక బోనకల్ మండల కేంద్రమునందు బోనకల్,ముష్టికుంట్ల,రాయన్నపేట, గోవిందాపూరం(ఎల్),చిన్నబీరవల్లి, రావినూతల మొదలైన గ్రామాల్లో నిర్మించిన రైతు వేదికల నిర్మాణ ఖర్చుల వివరాలు,రైతు వేదికల ఖర్చులకు గ్రామ పంచాయతీ నిధుల నుంచి ఖర్చు వివరాలు తీర్మానాలు, ప్రభుత్వా ప్రకారం రైతు వేదికల అంచనా వ్యయం గురించి సదరు వ్యక్తి సమాచార హక్కు చట్టం ద్వారా స్తానిక మండల పరిషత్ కార్యాలయ పౌరసమాచార అధికారిని ఏప్రిల్ 18 వ తేదీన వివరాలు అడగ్గా సమాచారం కోరిన నాటి నుంచి నేటి వరకు అధికారులు కనీసం ఏటువంటి వివరాలు సదరు పిర్యాదు దారుకి అందించకపివడంతో తీవ్ర అసంతృప్తి వ్యక్టం చేస్తూ తనకు రావాల్సిన సమచారం అందించడంలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన మండల పరిషత్ కార్యాలయ అధికారులపై ఉన్నత అధికారులు చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు దారుడు కోరడం జరిగింది.

Attachments area

Next Story
Share it