Sneha TV
తెలంగాణ

కప్పపహాడ్ గ్రామంలో ముగిసిన శ్రీశ్రీశ్రీ బీరప్ప జాతర ఘనంగా నిర్వహించారు

కప్పపహాడ్ గ్రామంలో ముగిసిన శ్రీశ్రీశ్రీ బీరప్ప జాతర ఘనంగా నిర్వహించారు
X

ఇబ్రహీంపట్నం మండలంలోని కప్పాపహాడ్ గ్రామంలో శ్రీశ్రీశ్రీ బీరప్ప కామరాతి దేవి కళ్యాణ మహోత్సవా కార్యక్రమాల్లో బుధవారం బీరప్ప ఒగ్గు కథ ముగిసింది.22 సంవత్సరాల తర్వాత గ్రామం లో పెద్ద ఎత్తున బీరప్ప జాతర నిర్వహించడం తో చాలా మంది భక్తులు హాజరు కావడం జరిగింది.గుడి ఆవరణలో భక్తులకు ఎలాంటి ఆటంకం కలగకుండా గత 7రోజులు నుచ్చి *ఇబ్రహీంపట్నం నియోజకవర్గం TRSV అధ్యక్షులు నిట్టు జగదీశ్వర్ దగ్గర ఉండి పనులు పర్యవేక్షించడం జరిగింది* .స్థానిక ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి గారి సహకారంతో మరియు పలు రాజకీయ పార్టీలు పెద్దలతో బీరప్ప జాతర పెద్ద ఎత్తున ఘనంగా నిర్వహించామని ఉత్సవ నిర్వాహకులు తెలిపారు.బీరప్ప జాతర ఎక్కడలేని విధంగా పెద్ద ఎత్తున చుట్టుపక్కల భక్తులతో ప్రజలతో ఎంత వైభవంగా నిర్వహించారు అని గ్రామ కుర్మా సంఘం నాయకులని ఎమ్మెల్యే మంచిరెడ్డి గారు ఫోన్ లో అభినందించడం జరిగింది. జాతర కి సహకరించిన పెద్దల అందరికి ప్రత్యేకంగా వారికి గ్రామ కురుమ సంఘం నాయకులు తదితరులు సన్మానించడం జరిగింది.. తొండూపల్లి గ్రామం ఒగ్గు కళాకారులు యాదయ్య బృందం వారు చెప్పిన బీరప్ప ఒగ్గు కథ భక్తులను అందర్నీ ఆకట్టుకుంది.ఈ కార్యక్రమంలో పెద్ద కురమా నిట్టు ఆంజయ్య, నిట్టు శ్రీనివాస్,నిట్టు వీరయ్య కుర్మా సంఘము నాయకులు నిట్టు నరసింహ, మహిపాల్,అరగే శ్రీశైలం,శ్రీశైలం,ఏల్లయ్య,లింగం,నిట్టు మధు,బీరయ్య,నాగ భూషణ్, బిరయ్య,కిట్టు,శ్రీకాంత్,వెంకటేష్, ఉత్సవ నిర్వాహకులు తదితరులు పాల్గొన్నారు.

Next Story
Share it