Sneha TV
తెలంగాణ

ఆరోగ్యశాఖ, పంచాయతీరాజ్ శాఖ మంత్రులను కలిసిన ఎమ్మేల్యే డా. సంజయ్

ఆరోగ్యశాఖ, పంచాయతీరాజ్ శాఖ మంత్రులను కలిసిన  ఎమ్మేల్యే డా. సంజయ్
X

జగిత్యాల, జూన్ 22 (ప్రజాపాలన ప్రతినిధి): బుధవారం హైదరాబాదులో ఆరోగ్యశాఖ మంత్రి హరీష్ రావు ను ఎమ్మేల్యే డా సంజయ్ కుమార్ కలిసి పులమొక్క అందజేసి ధన్యవాదాలు తెలియజేశారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ జగిత్యాల మెడికల్ కాలేజ్ కి ప్రత్యేకంగా అన్ని విధాల సౌకర్యాలు కల్పించి, కాలేజీకి ఉపాధ్యాయ బృందం టీచింగ్, నాన్ టీచింగ్ స్టాఫ్ కూడా పూర్తిస్థాయిలో నియామకం ఇవ్వడం వల్ల నేషనల్ మెడికల్ కమిషన్ రెండవ దపా అనుమతులు ఇవ్వడం 150 విద్యార్థులకి ఈ విద్యా సంవత్సరం నుంచే తరగతులు ప్రారంభం కావడానికి సహకరించిన మంత్రి కి కృతజ్ఞతలు తెలియజేసినారు. ఆనంతరం హైదరాబాదులో పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ను కలిసి నియోజకవర్గంలో నూతన గ్రామ పంచాయతీలకు నిధులు మరియు గ్రామాల్లో సిసి రోడ్లకు నిధులు మంజూరు కు వినతిపత్రం అందజేయగా మంత్రి సానుకూలంగా స్పందించి నిధుల మంజూరుకు హామీ ఇచ్చినారు.

Next Story
Share it