Sneha TV
తెలంగాణ

నిరంతరంగా విద్యుత్ సరఫరా చేయండి వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్

నిరంతరంగా విద్యుత్ సరఫరా చేయండి  వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్
X

వికారాబాద్ బ్యూరో జూన్ 22 ప్రజాపాలన : నిరంతరంగా విద్యుత్ సరఫరా చేయాలని వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ సంబంధిత విద్యుత్ అధికారులకు సూచించారు. మంగళవారం సాయంత్రం మోమిన్ పేట్ మండల పరిధిలోని బాల్ రెడ్డిగూడ గ్రామంలో మండల టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు దబ్బని వెంకట్ ఆధ్వర్యంలో గ్రామ సర్పంచ్ నాసన్ పల్లి చంద్రకళ గోవర్ధన్ రెడ్డి, ఉప సర్పంచ్ చంద్రయ్య, పంచాయతీ కార్యదర్శి శ్రీజ, ఎంపీటీసీ ఆర్ మానస గోవర్ధన్ రెడ్డిలతో కలిసి వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ *"మీతో నేను"* కార్యక్రమంలో భాగంగా బాల్ రెడ్డి గూడ గ్రామంలో సాయంత్రం 5 గంటల నుండి 8 గంటల వరకు పర్యటించారు. తెలంగాణ రాష్ట్రముఖ్యమంత్రి కెసిఆర్ కల్పించిన సువర్ణావకాశంతో బాల్ రెడ్డి గూడ నూతన గ్రామ పంచాయతీగా ఏర్పడిందని అభివృద్ధికి మరిన్ని అవకాశాలు ఏర్పడ్డాయన్నారు. బాల్ రెడ్డి గూడ, చీమలదరి, దేవరంపల్లి, చక్రంపల్లి గ్రామాలలో విద్యుత్ అంతరాయాలు మళ్లీ మళ్లీ ఏర్పడుతున్నాయని ప్రజలు ఎమ్మెల్యే దృష్టికి తెచ్చారు. స్పందించిన ఎమ్మెల్యే విద్యుత్ శాఖ అధికారులతో మాట్లాడి ఎబి స్విచ్ లు, 5 ఇంటర్ పోల్స్, 4 ట్రాన్స్ ఫార్మమ్ లనే ఒకే దగ్గరకు చేర్చుట వంటివి ఏర్పాటు చేయాలని ఆదేశించారు. తెలంగాణ ప్రభుత్వం రైతులకు ప్రమాదవశాత్తు మరణిస్తే *రైతు భీమా* కల్పిస్తుందని గుర్తు చేశారు. రైతు భీమాకు దరఖాస్తు చేసుకోలేని రైతులు ఇంకా ఎవరైనా ఉంటే వెంటనే దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. కొత్త పాస్ పుస్తకాలు వచ్చినవారు కూడా దరఖాస్తు చేసుకోవాలని వివరించారు. అందుకు రైతులకు అవగాహన కల్పించాలని వ్యవసాయ శాఖ అధికారులను కోరారు. గ్రామంలోని అవసరమైన వీధులలో కొత్త స్తంభాలు వేసి వైర్లు గుంజాలని స్పష్టం చేశారు. గ్రామంలో మరియు పంటపొలాల్లో వేలాడుతున్న విద్యుత్ తీగలను సరిచేయాలని తెలిపారు. నూతన ట్రాన్స్ఫార్మర్లు ఏర్పాటు చేసి ఎలాంటి అంతరాయాలు లేకుండా విద్యుత్ సరఫరా చేయాలని అధికారులను ఆదేశించారు. మిషన్ భగీరథ మంచినీటి నల్లా కనెక్షన్ ప్రతీ ఇంటికి కచ్చితంగా ఇవ్వాలని, లీకేజీలు లేకుండా ఎప్పటికప్పుడు పరిశీలన చేస్తూ సురక్షిత మంచి నీటి సరఫరా చేయాలని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో బాల్ రెడ్డిగూడ గ్రామ టిఆర్ఎస్ పార్టీ అధ్యక్ష ఉపాధ్యక్షులు బి.ప్రభాకర్ రెడ్డి, రామన్నోల్ల నరేందర్ రెడ్డి, గ్రామ పెద్దలు ఆర్.గోపాల్ రెడ్డి, ఎన్.మల్ రెడ్డి, బి.దేవేందర్ రెడ్డి, బి.కిష్టయ్య, బి.మల్లయ్య, ఎం.సత్యనారాయణ, బీరయ్య, అనంత్ రెడ్డి, ప్రజాప్రతినిధులు, అధికారులు, పార్టీ నాయకులు కార్యకర్తలు గ్రామస్తులు మరియు తదితరులు పాల్గొన్నారు.


Next Story
Share it