Sneha TV
తెలంగాణ

పేకాట,కోడి పందాలు వంటి అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటాం ఎస్సై మేడా ప్రసాద్....

పేకాట,కోడి పందాలు వంటి అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటాం ఎస్సై మేడా ప్రసాద్....
X

ఎర్రుపాలెం డిసెంబర్ 13 ప్రజాపాలన ప్రతినిధి: ఎర్రుపాలెం పోలీసు స్టేషన్ పరిధిలోని గ్రామ ప్రజలందరికీ ముందుగా సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు. ఈ సంక్రాంతి పండుగను ప్రజలందరూ ప్రశాంత వాతావరణంలో కుటుంబ సభ్యులతో ఆనందంగా గడపాలని కోరుకుంటున్నాము. పేకాట,కోడిపందాలు లాంటి అసాంఘిక కార్యకలాపాలకు ఎవరైనా పాల్పడితే వారిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము. తమ పరిసర ప్రాంతాల్లో ఎవరైనా ఇలాంటి అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే వెంటనే పోలీసువారికి సమాచారం అందించాలని విజ్ఞప్తి చేస్తున్నాము. కావున ఎర్రుపాలెం మండల ప్రజలందరూ పోలీసు వారికి సహకరించాలని కోరుచున్నాము. మేడా ప్రసాద్ సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ ఎర్రుపాలెం.

Next Story
Share it