Sneha TV
తెలంగాణ

గుండి బ్రిడ్జిని పరిశీలించిన జిల్లా కలెక్టర్

గుండి బ్రిడ్జిని పరిశీలించిన జిల్లా కలెక్టర్
X

కాగజ్ నగర్ జనవరి 12, ప్రజాపాలన ప్రతినిధి : కుంరంభీం జిల్లా ఆసిఫాబాద్ మండలంలోని గుండి వంతెన(బ్రిడ్జి)ను జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ పరిశీలించారు. మద్యంతరంగా వంతెన నిలిచిపోయి ప్రజలకు కలుగుతున్న ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని వంతెన నిర్మాణ పనులను త్వరితగతిన ప్రారంభించాలని అధికారులను ఆదేశించారు. వర్షాల కారణంగా తాత్కా లికంగా ఏర్పాటు చేసుకున్న వంతెన కూడా తెగిపోవడంతో ప్రజల సౌకర్యాల కోసం వెంటనే పూర్తి చేయాలని కోరారు. కలెక్టర్ వెంట డి.ఈ.కృష్ణ, ఏ.ఈ.రామ్ కిరణ్, గుండి ఎంపీటీసీ తదితరులు పాల్గొన్నారు.

Next Story
Share it